Home న్యూస్ 100 డేస్ ముందే అన్ని ఏరియాలు ఔట్….యంగ్ టైగర్ మాస్ పవర్!!

100 డేస్ ముందే అన్ని ఏరియాలు ఔట్….యంగ్ టైగర్ మాస్ పవర్!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ముందు సమ్మర్ లో రిలీజ్ అనుకున్నా కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ 10న రిలీజ్ ను కన్ఫాం చేసుకుని మళ్ళీ తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర…

సెప్టెంబర్ ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయిన ఈ సినిమా ప్రస్తుతానికి కల్కి(Kalki2898AD)మూవీ తర్వాత కొంత గ్యాప్ కి రిలీజ్ కానున్న పెద్ద సినిమా అవ్వడం అలాగే సలార్(Salaar) తర్వాత టాలీవుడ్ లో రిలీజ్ కానున్న బిగ్గెస్ట్ మాస్ మూవీ ఇదే అవ్వడంతో ట్రేడ్ లో ఆడియన్స్ లో సినిమా మీద క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది…

ఆ క్రేజ్ ఇంపాక్ట్ వలెనే రిలీజ్ కి చాలా రోజుల ముందు నుండే ఈ సినిమా సంచలనాలను నమోదు చేస్తూ ఉండటం విశేషం, సినిమా రిలీజ్ కి ఇంకా ఆల్ మోస్ట్ 100 రోజుల టైం ఉండగా, ఇప్పుడు 100 రోజుల టైం ఉండగానే సినిమా ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ మొత్తం కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది…

అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అన్ని ఏరియాల్లో సొంతం చేసుకున్న దేవర మూవీ ఎన్టీఆర్ మాస్ పవర్ ఏ రేంజ్ లో ఉందో బిజినెస్ పరంగా రుజువు చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత సోలో మూవీతో వస్తున్న ఎన్టీఆర్ ఇక ఏ రేంజ్ లో కలెక్షన్స్ తో రచ్చ చేస్తాడో అన్నది సెప్టెంబర్ 27న తేలనుంది….

ఓవరాల్ గా సినిమా ఏమాత్రం అంచనాలను అందుకుని పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది….సోలో రిలీజ్ కూడా సొంతం కాబోతుంది కాబట్టి టాక్ బాగుంటే దసరా టైం వరకు రికార్డుల జాతర ఖాయమని చెప్పోచ్చు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here