Home న్యూస్ 20,000,000 ఔట్….100 కోట్ల సినిమాతో మంచు విష్ణు మాస్ రాంపెజ్!

20,000,000 ఔట్….100 కోట్ల సినిమాతో మంచు విష్ణు మాస్ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న వాళ్ళలో ఒకరైన మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయిన కన్నప్ప(Kannappa Movie) ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ ఎండ్ టైంకి రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను…

రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా సొంతం అయ్యింది… టీసర్ లో కొన్ని షాట్స్ ట్రోల్స్ కి కారణం అయినా కూడా ఓవరాల్ గా టీసర్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా మొదటి 3-4 రోజుల్లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకున్న తర్వాత కొంచం స్లో అయినా కూడా…

ఇప్పుడు ఏకంగా 20 మిలియన్ వ్యూస్ మార్క్ రేంజ్ కి వెళ్ళిన కన్నప్ప టీసర్ సినిమా మీద డీసెంట్ హైప్ ఉందని రుజువు చేసింది. రీసెంట్ టైంలో ఫామ్ లో అస్సలు లేని హీరోల టీసర్ లలో కన్నప్ప టీసర్ కి బెస్ట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి.. ప్రభాస్ మరియు ఇతర ఇండస్ట్రీ స్టార్స్ అలాగే 100 కోట్ల బడ్జెట్ మూవీ అంటూ టాక్ ఉండటం లాంటివి…

సినిమాకి మంచి రీచ్ సొంతం అవ్వడానికి కారణం అయ్యి ఓవరాల్ గా వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కి మంచి రీచ్ ను సొంతం చేసుకునేలా టీసర్ మెప్పించడం విశేషం….ఇక సినిమా కూడా అంచనాలను అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణుకి ఈ సినిమా మంచి కంబ్యాక్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here