Home న్యూస్ రిలీజ్ కి 5 రోజుల ముందే 21 కోట్లు ఔట్….రెబల్ స్టారా…మజాకా!!

రిలీజ్ కి 5 రోజుల ముందే 21 కోట్లు ఔట్….రెబల్ స్టారా…మజాకా!!

0

రిలీజ్ కి టైం దగ్గర పడుతున్న కొద్ది పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా భారీ అంచనాల నడుమ ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్2 తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి ఇప్పుడు.

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఫుల్ జోరుని ఓవర్సీస్ లో చూపిస్తూ ఉండగా నార్త్ అమెరికాలో ఆల్ రెడీ ఫాస్టెస్ట్ హాల్ఫ్ మిలియన్, మిలియన్, 1.5 మిలయన్ మరియు 2 మిలియన్ రికార్డులను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా ఇప్పుడు రిలీజ్ కి ఇంకా 5 రోజులు ఉండగా టోటల్ గా నార్త్ అమెరికాలో…

వీకెండ్ ప్రీ టికెట్ సేల్స్ ద్వారా ఏకంగా 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి ఇప్పుడు 3 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా మీద ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి అన్నదానికి ఇది నిదర్శనం అని చెప్పాలి. ఇండియన్ కరెన్సీలో ఆల్ రెడీ సినిమా ఇప్పటి వరకు…

నార్త్ అమెరికాలో సాధించిన కలెక్షన్స్ తో 21 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం కాగా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అవ్వాల్సి ఉండగా ఆల్ రెడీ ఓవర్సీస్ లో రెబల్ స్టార్ స్టార్ పవర్ తో దుమ్ము లేపడంతో ఇండియాలో బుకింగ్స్ పరంగా కూడా ఇప్పుడు రికార్డ్ బుకింగ్స్ తో…

మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది, ఇండియా వైడ్ గా కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు భారీ లెవల్ లో రిలీజ్ కానున్న సినిమా ఇదే అవ్వడంతో ట్రైలర్2 రేంజ్ లోనే సినిమా ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే ఇక ప్రభాస్ బాక్స్ ఆఫీస్ రికార్డుల వేట మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here