2024 ఇయర్ ఇండియన్ మూవీస్ లో బిగ్గెస్ట్ మూవీ అయిన రెబల్ స్టార్ ప్రభస్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మూవీ ఆడియన్స్ ముందుకు అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న సినిమాకి U/A సర్టిఫికెట్ సొంతం అవ్వగా 3 గంటల 1 నిమిషం రన్ టైంతో వస్తున్న ఈ సినిమా….
ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అయ్యింది అన్ని తెలియగా రెస్పాన్స్ మాత్రం సూపర్ పాజిటివ్ గా ఉందని చెప్పాలి. చాలా వరకు సెన్సార్ టాక్ పాజిటివ్ గానే ఉంటుంది కానీ కల్కి కి మాత్రం టాక్ ఇంకా బెటర్ గా ఉందని తెలుస్తుంది ఇప్పుడు…
కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కూడా మహాభారతం టైంలో తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని చూస్తున్న అశ్వద్ధామ కలియుగం టైంలో ఒక అమ్మాయి కడుపులో దైవం ఉందని తెలిసి తనని కాపాడాలని నిర్ణయం తీసుకుంటాడు…అదే టైంలో అన్ని వసతులు ఉన్న కాంప్లెక్స్ లో ఎంటర్ అవ్వాలి అంటే ఆ అమ్మాయిని విలన్స్ కి అప్పగించాల్సిన అవసరం హీరోకి ఏర్పడగా అశ్వద్ధామకి హీరోకి మధ్య పోరు ఎలా జరిగింది ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా కథ అని అంటున్నారు….
ప్రభాస్ ని ట్రైలర్స్ లో అండర్ ప్లే చేసినా కూడా సినిమాలో తన రోల్ కి ఉన్న ఎలివేషన్ లు, హీరోయిజం ఎలివేట్ సీన్స్ మరో లెవల్ లో ఉంటాయని అంటున్నారు, అదే టైంలో అమితాబ్ రోల్ కి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం అని అంటున్నారు…పాటలు సినిమాలో పెద్దగా లేకపోవడం,బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించేలా ఉన్నాయని అంటున్నారు…
కథ టేక్ ఆఫ్ కి కొంచం టైం పట్టినా కూడా అసలు కథ మొదలు అయిన తర్వాత ఆడియన్స్ చూపు కూడా తిప్పుకోనివ్వని విధంగా అద్బుతమైన విజువల్స్ మైండ్ బ్లోయింగ్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ మరో ప్రపంచంలో ఉన్నట్లు ఫీల్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే ప్రీ క్లైమాక్స్ తో క్లైమాక్స్ ఎపిసోడ్ లు చాలా బాగా వచ్చాయని అంటున్నారు.
ఇక సినిమాలో స్పెషల్ రోల్స్ లో వచ్చే యాక్టర్స్ ఎంట్రీలకు ఆడియన్స్ బాగా థ్రిల్ ఫీల్ అవ్వడం ఖాయమని చెబుతూ ఉండగా ఓవరాల్ గా లెంత్ ఒక్కటి కొంచం ఎక్కువ అయినట్లు అనిపించింది అంటున్నారు… ఓవరాల్ గా సినిమా మాత్రం ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను చాలావరకు అందుకోవడం ఖాయమని చెబుతున్నారు…
సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకి సూపర్ హిట్ రేంజ్ లో రెస్పాన్స్ అయితే ఇప్పుడు వినిపోస్తుంది. ఇక ఇదే రేంజ్ లో టాక్ ప్రీమియర్స్ టు రెగ్యులర్ షోలకి సినిమాకి కనుక సొంతం అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ఆడించే ఆట రికార్డుల వేట మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.