బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపెసిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కూడా సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకుని రెండో రోజు కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ అయ్యింది….దాంతో సినిమా మూడో రోజు కలెక్షన్స్ రెండో రోజు కన్నా మించిపోవడం ఖాయమని అనుకున్నారు…
కానీ ఇండియా వరల్డ్ కప్ గెలవడంతో నైట్ షోలకు ఇంపాక్ట్ పడింది…దాంతో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాకపోయినా కూడా ఆల్ మోస్ట్ సినిమా డే 2 కి చేరువ అయ్యే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. రెండో రోజు 20 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ మూడో రోజుకి వచ్చే సరికి 17 లక్షల డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుని…..
19.83 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 30.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది…. ఇండియా వైడ్ గా నైట్ షోలకు కలెక్షన్స్ లో కొంచం డ్రాప్స్ రాగా అయినా కూడా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Here is Kalki 2898 AD Day 3 AP TG Collections(Inc GST)
👉Nizam: 10.62Cr
👉Ceeded: 2.40CR
👉UA: 2.10Cr
👉East: 1.05Cr
👉West: 76L
👉Guntur: 1.18Cr
👉Krishna: 1.17Cr
👉Nellore: 55L
AP-TG Total:- 19.83CR(30.75CR~ Gross)
ఓవరాల్ గా ఇప్పుడు సినిమా మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 84.69 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా గ్రాస్ కలెక్షన్స్ లెక్క 132.3 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో 170 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సి ఉండగా 3 రోజుల కలెక్షన్స్ కాకుండా ఇంకా…
85.31 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమాకి 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ లభించడంతో రెట్టించిన జోరు చూపించి కలెక్షన్స్ పరంగా మరింత జోరు చూపించే అవకాశం ఉంటుంది. ఇక వర్కింగ్ డేస్ హోల్డ్ ని బట్టి మిగిలిన కలెక్షన్స్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో అన్నది చెప్పగలం….