Home న్యూస్ 4th డే కల్కి కలెక్షన్స్….రెబల్ స్టార్ ప్రళయ తాండవం!!

4th డే కల్కి కలెక్షన్స్….రెబల్ స్టార్ ప్రళయ తాండవం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 3 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki2898AD Movie) నాలుగో రోజులో అడుగు పెట్టగా సినిమా సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. మొదటి రోజు తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు బెస్ట్ ట్రెండ్ ను సినిమా చూపెడుతూ…

రెబల్ స్టార్ బాక్స్ ఆఫీస్ మాస్ రాంపెజ్ పవర్ ను చూపెడుతుంది…. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ ఆల్ మోస్ట్ డే 2 మరియు డే 3 రేంజ్ లోనే ఓపెన్ అవ్వగా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో కొద్ది వరకు గ్రోత్ ఈ రోజున చూపెడుతుంది సినిమా….నైజాంలో మరోసారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రేంజ్ లో షేర్ ని…

అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపొతే 21-22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీలో ఈ రోజు సినిమా 35-37 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఈ రోజున అందుకునే అవకాశం ఉండగా హిందీ కలెక్షన్స్ అంచనాలను కూడా మించే అవకాశం ఉంది…

ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళలో ఈ రోజు సూపర్ సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న సినిమా ఈ చోట్లలో ఈ రోజు 10 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఇండియాలో సినిమా 4వ రోజున 48-50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా….

ఓవరాల్ గా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి 4వ రోజున 58-60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు వర్షాల వలన ఏమైనా ఇబ్బందులు ఎదురు అయితే తప్పితే సినిమా ఇదే రేంజ్ లో జోరు చూపించే అవకాశం ఉంది. మొత్తం మీద ఇదే రేంజ్ లో సినిమా జోరు చూపిస్తే మొదటి రోజు తర్వాత ఇది బెస్ట్ డే అవ్వడం ఖాయం. ఇక టోటల్ గా మొదటి వీకెండ్ లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here