Home న్యూస్ 184 కోట్ల సినిమా….ఇక్కడ 175 రోజులు ఏంటి సామి!!

184 కోట్ల సినిమా….ఇక్కడ 175 రోజులు ఏంటి సామి!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)ల  క్రేజీ కాంబోలో వచ్చిన ఈ ఇయర్ సంక్రాంతి మూవీ గుంటూరు కారం(Guntur Kaaram 175 Days Centers) సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అయితే సొంతం అవ్వలేదు…

మిక్సుడ్ రెస్పాన్స్ అండ్ పోటిలో హనుమాన్(HanuMan Movie) తో పోటి లో భారీ విజయం ఇంపాక్ట్ వలన పరుగును త్వరగానే పూర్తి చేసుకున్నా కూడా గుంటూరు కారం డిజిటల్ లో భారీ విజయాన్నే సొంతం చేసుకుంది. అలాగే సినిమా పాటలకు రెస్పాన్స్ రిలీజ్ టైములో కన్నా కూడా…..

బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత భారీ రీచ్ ను సొంతం చేసుకోగా రిలీజ్ టైం లో కన్నా రిలీజ్ తర్వాతే ఎక్కువ రీచ్ ను సొంతం చేసుకున్న గుంటూరు కారం టోటల్ రన్ లో బాక్స్ అఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని యావరేజ్ రిజల్ట్ తో పరుగును పూర్తి చేసుకుంది.

కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో 175 రోజులను పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది సినిమా….ఆంధ్రప్రదేశ్ లో సినిమా చిలకలూరిపేట-వెంకటేశ్వర థియేటర్ లో రీసెంట్ గా 175 వ రోజును కంప్లీట్ చేసుకుంది…అది కూడా రోజుకి 4 షోలతో కంప్లీట్ చేసుకుంది సినిమా…

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ త్వరగానే కంప్లీట్ ఆయినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా ఇప్పుడు ఒక సెంటర్ లో 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత తన తర్వాత సినిమా ఇండియన్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) డైరెక్షన్ లో చేయబోతూ ఉండగా ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఏ లెవల్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here