Home న్యూస్ కల్కి 2898 AD హిందీ 11 డేస్ టోటల్ కలెక్షన్స్…..ఊరమాస్ రాంపెజ్!!

కల్కి 2898 AD హిందీ 11 డేస్ టోటల్ కలెక్షన్స్…..ఊరమాస్ రాంపెజ్!!

0

హిందీలో సినిమా హిట్ అవ్వాలి అంటే మంచి ప్రమోషన్స్ చాలా అవసరం, కానీ అదే చోట ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ ఏమి లేక పోవడంతో మినిమమ్ ఓపెనింగ్స్ వచ్చినా గొప్ప విషయమే అని అనుకున్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత….

యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో రిలీజ్ అయిన రోజు నుండి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా మొదటి వారంలో దుమ్ము లేపిన తర్వాత రెండో వీకెండ్ లో సినిమా జోరు చూపించడం ఖాయం అనుకున్నా కూడా…

అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించిన సినిమా 11వ రోజు హిందీలో రెట్టించిన జోరు చూపించి ఏకంగా 22 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది. దాంతో హిందీలో 11 రోజుల్లో హిందీలో ఏకంగా 200 కోట్ల నెట్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.

ఓవరాల్ గా సినిమా హిందీ లో సాధించిన డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Kalki2898AD (Hindi) Day Wise Collections(NET)
👉 Day 1 – 22.50CR
👉 Day 2 – 23.25CR
👉 Day 3 – 26.25CR
👉 Day 4 – 40.15CR
👉 Day 5 – 16.50CR
👉 Day 6 – 13CR
👉 Day 7 – 11.50CR
👉 Day 8 – 10.10CR
👉 Day 9 – 9.75CR
👉 Day 10 – 17.50CR
👉 Day 11 – 22.00CR****
Total Collections- 212.50CR NET

మొత్తం మీద హిందీలో రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో రెండో 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని హిందీలో అందుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసి సౌత్ హీరోలలో ఎవ్వరూ సాధించని రికార్డ్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో హిందీలో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here