Home న్యూస్ 11వ రోజు 2 ఇండస్ట్రీ రికార్డులు…రెబల్ స్టార్ మమ్మోత్ రికార్డ్ ఇది!!

11వ రోజు 2 ఇండస్ట్రీ రికార్డులు…రెబల్ స్టార్ మమ్మోత్ రికార్డ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ రికార్డుల ఊచకోత కోస్తూ ఇప్పుడు 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను అన్నీ కూడా మించి పోయి అల్టిమేట్ వసూళ్ళతో దుమ్ము దుమారం లేపింది…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 10.01 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపింది…కాగా టాలీవుడ్ చరిత్రలో 11వ రోజున సినిమా ఇండస్ట్రీ రికార్డ్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు…

ఇది వరకు 11వ రోజు టాప్ కలెక్షన్స్ పరంగా బాహుబలి2(Baahubali2 Movie) ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేయగా తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎండ్ లో సలార్(Salaar Movie) 11వ రోజున బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసింది…ఇక ఇప్పుడు కల్కి మూవీ సలార్ ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేసింది.

ఒకసారి టాలీవుడ్ చరిత్రలో 11వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
11th Day All Time Highest Share movies in Telugu States
👉#KALKI2898AD – 10.01CR*******
👉#SALAAR – 8.28Cr
👉#Baahubali2 – 6.80Cr
👉#RRRMovie – 4.98CR
👉#Baahubali – 3.76Cr
👉#HanuMan- 3.34Cr
👉#Jailer(Dub) – 3.28Cr
👉#Maharshi: 3.22Cr
👉#KGFChapter2(Dub) – 3.16Cr
👉#Akhanda: 3.08Cr
👉#Syeraa-2.73Cr

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ 2 సార్లు ఇండస్ట్రీ రికార్డ్ 11వ రోజు కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ గా 3 సార్లు ప్రభాస్ నటించిన సినిమాలు 11వ రోజున ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించాడు…ఇక ఈ రికార్డ్ ను ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here