బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని దుమ్ము లేపే రేంజ్ లో కంప్లీట్ చేసుకుని 12వ రోజు నుండి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా మేకర్స్ నిర్ణయం వలన అనుకున్న దాని కన్నా ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది…
సినిమా టికెట్ హైక్స్ ని రెండో వీకెండ్ తర్వాత తగ్గించుకునే అవకాశం ఉన్నా కూడా చాలా చోట్ల టికెట్ హైక్స్ ని అలానే ఉంచగా వర్కింగ్ డేస్ లో తక్కువ రేట్స్ ఉంటే థియేటర్స్ వెళదాం అనుకున్న వాళ్ళు ఆ రేట్స్ వలన అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి వెళ్ళలేదు…
దాంతో నార్మల్ గా హాలిడే తర్వాత వర్కింగ్ డే లో 60-65% రేంజ్ లో డ్రాప్ కామన్ గా ఉండాల్సిన చోట ఏకంగా 80% వరకు డ్రాప్ అయ్యింది కల్కి మూవీ…మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా జోరు ఉంటే 2.5-3 కోట్ల దాకా వెళుతుంది అనుకున్నా కూడా సినిమా 2 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకుంది…
ఒకసారి 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD Day 12 AP TG Collections(Inc GST)
👉Nizam: 98L
👉Ceeded: 20L
👉UA: 25L
👉East: 15L
👉West: 13L
👉Guntur: 10L
👉Krishna: 11L
👉Nellore: 9L
AP-TG Total:- 2.01CR(3.45CR~ Gross)
ఇక సినిమా టోటల్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD 12 Days Telugu States Total Collections(Inc GST)
👉Nizam: 81.66Cr
👉Ceeded: 18.83CR
👉UA: 19.14Cr
👉East: 11.14Cr
👉West: 8.29Cr
👉Guntur: 10.02CR
👉Krishna: 10.15Cr
👉Nellore: 5.36Cr
AP-TG Total:- 164.59CR(255.15CR~ Gross)
ఓవరాల్ గా 12వ రోజు అనుకున్న దాని కన్నా కూడా కల్కి మూవీ ఎక్కువగానే డ్రాప్ అయినా కూడా 168 కోట్ల వాల్యూ బిజినెస్ కి చాలా వరకు రికవరీని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ పరంగా జోరుని కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.