బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీక్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) అలాగే కొత్తగా రిలీజ్ అయిన కమల్ హాసన్(Kamal Haasan) నటించిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) లు వీకెండ్ ను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టాయి…వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన 2 సినిమాలు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కల్కి ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ ఉండగా మొత్తం మీద సినిమా 19వ రోజు ఇప్పుడు 80 లక్షల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
ఇక భారతీయుడు2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో 80% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 40-50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీలో కల్కి మూవీ 3.2-3.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…
తమిళ్ లో భారతీయుడు2 డ్రాప్స్ సాలిడ్ గానే ఉండగా 2.5-3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా కల్కి మూవీ ఇప్పుడు 19వ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉండగా…
భారతీయుడు2 మూవీ 4వ రోజు వర్కింగ్ డే లో వరల్డ్ వైడ్ గా 7-8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.. ఓవరాల్ గా రెండు సినిమాలు వర్కింగ్ డే లో డ్రాప్ అవ్వగా కల్కి ఆల్ రెడీ హెవీ లాభాలలోనే ఉండగా భారతీయుడు2 చాలా కష్టాల్లో ఉంది. ఇక 2 సినిమాల వర్కింగ్ డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…