బాక్స్ ఆఫీస్ దగ్గర జనాల చేత టికెట్స్ తెంపడానికి మేకర్స్ అప్పుడప్పుడు టికెట్ రేట్స్ ను అనుకున్న దాని కన్నా తగ్గించడం, ఒక టికెట్ కొంటె ఒక టికెట్ ఫ్రీ అనడం, ఫ్లాట్ 100rs టికెట్ రేట్ పెట్టడం ఇలా అనేక రకాల ఆఫర్స్ ను పెట్టి జనలాను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు… కానీ అన్ని సార్లు ఇది వర్కౌట్ అవ్వలేదు…
లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) కెరీర్ లో 150వ సినిమాగా రూపొందిన ఓటిటి బ్లాక్ బస్టర్ ఆకాశం నీ హద్దురా హిందీ రీమేక్ సర్ ఫిరా(Sarfira Movie) రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది…
వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న అక్షయ్ కుమార్ కి ఈ సినిమా మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది అన్న నమ్మకం పెట్టుకున్నా కూడా సినిమా టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా వీకెండ్ మొత్తం మీద 12.50 కోట్ల రేంజ్ లోనే…
నెట్ కలెక్షన్స్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరచగా…మేకర్స్ వెంటనే తేరుకుని సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి సినిమాకి వెళ్ళండి….టీ అండ్ 2 సమోసాలు ఫ్రీ అంటూ ప్రమోషన్ ని మొదలు పెట్టారు..సెలెక్టివ్ థియేటర్స్ లో ఈ ఆఫర్ ను పెట్టగా జనాలు సినిమాను చూడటానికి…
వస్తారు అనుకున్నా కూడా ఆడియన్స్ మాత్రం పెద్దగా ఆసక్తిని చూపించలేదు…దాంతో 4వ రోజు మొత్తం మీద వర్కింగ్ డే లో 1.4 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుని అత్యంత తీవ్రంగా నిరాశ పరిచింది…. ఆఫర్ పెట్టినా కూడా మొత్తం మీద నిరాశ పరిచే కలెక్షన్స్ తో…
4 రోజుల్లో మొత్తం మీద 14 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ నే అందుకుని ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ వైపు పరుగులు పెడుతుంది… ఎంత పాజిటివ్ టాక్ ఉన్నా, టికెట్ ఆఫర్స్ పెట్టినా కూడా జనాలు థియేటర్స్ లోకి రాకపోవడంతో ఇక తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదు…మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక…