బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది….
కానీ ఓవరాల్ గా మొదటి వారం తర్వాత కలెక్షన్స్ పరంగా చూసుకుంటే తమిళ్ లో రికవరీ కన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో రికవరీ పరంగా మంచి జోరునే చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో శంకర్ మూవీస్ కి ఉన్న క్రేజ్ దృశ్యా టాక్ ఎంత మిక్సుడ్ గా ఉన్నా కూడా మొదటి వారంలో డీసెంట్ రికవరీని సాధించింది.
తమిళ్ లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 65-70 కోట్ల దాకా ఉంటుందని అంచనా….ఆ బిజినెస్ ని అందుకోవాలి అంటే సినిమా 145 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా మొదటి వారంలో కేవలంలో 43.40 కోట్ల గ్రాస్ నే అందుకోగా మొదటి వారంలో 30% వరకే రికవరీని సాధించింది…
అదే టైంలో తెలుగులో సినిమా వాల్యూ షేర్ 25 కోట్ల దాకా ఉండగా సినిమా ఆల్ మోస్ట్ 13 కోట్ల దాకా షేర్ ని అందుకోగా మొదటి వారంలో 55% లోపు రికవరీని సాధించింది….అంటే ఓవరాల్ రికవరీ పరంగా చూసుకుంటే తమిళ్ ఫస్ట్ వీక్ రికవరీ కన్నా కూడా తెలుగు ఫస్ట్ వీక్ రికవరీ…
ఎక్కువగా ఉండటం మన ఆడియన్స్ టాక్ కి అతీతంగా సినిమాలను చూస్తారు అన్నదానికి నిదర్శనం, అదే టైంలో శంకర్ క్రేజ్ పవర్ ఇప్పటికీ తెలుగులో స్టడీగానే ఉందని చెప్పాలి. కానీ సొంతగడ్డ తమిళ్ లోనే భారీ బడ్జెట్ మూవీకి ఏమాత్రం ఆశించిన కలెక్షన్స్ ని ఇవ్వలేక పోయారు తమిళ్ ఆడియన్స్…ఇక లాంగ్ రన్ లో ఇండియన్2 ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.