బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు ప్రియదర్శి(Priyadarshi) మరియు నభా నటేష్(Nabha Natesh) ల కాంబినేషన్ లో రూపొందిన డార్లింగ్(Darling Movie 1st Day Collections) సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ ను సొంతం చేసుకుని సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా..
ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత మొదటి ఆటకే ఆశించిన టాక్ ను సొంతం చేసుకోలేక పోయిన సినిమా కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది…వర్షాలు కూడా ఇంపాక్ట్ ని చూపించడం వలన మొదటి రోజు మొత్తం మీద 5.5 వేల లోపు టికెట్ సేల్స్ ను మాత్రమే…
సొంతం చేసుకున్న డార్లింగ్ మూవీ ఓవర్సీస్ లో కూడా బిలో పార్ కలెక్షన్స్ నే అందుకుంది. ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అంతంత మాత్రమే ఉండగా మొదటి రోజు ట్రేడ్ లెక్కల్లో తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోగా…
వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా 45 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకుందని అంచనా… ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ ఏకంగా 7 కోట్ల రేంజ్ లో జరిగిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. సినిమా 7.5 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…
బరిలోకి దిగిన సినిమా మొదటి రోజే పెద్ద దెబ్బ పడినట్లు అయింది ఇప్పుడు. ఓవరాల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా సాలిడ్ గా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.