టాలీవుడ్ లో మూడు నెలల అన్ సీజన్ ఇంపాక్ట్ వలన కొన్ని పర్వాలేదు బాగున్నాయి అనిపించే సినిమాలు కూడా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించలేదు….జూన్ నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) కన్నా ముందు రిలీజ్ అయిన మూవీస్ లో డబ్ మూవీ మహారాజ(Maharaja Movie) టైంలో…
రిలీజ్ అయిన తెలుగు స్ట్రైట్ మూవీ హరోం హర(Harom Hara Movie) మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. దాంతో సుదీర్ బాబు(Sudheer Babu) కి మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నారు అందరూ… మంచి రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా సినిమా…
ఏమాత్రం ఇంపాక్ట్ చూపించ లేక పోయిన ఈ సినిమా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది…. అక్కడ మంచి రివ్యూలను సొంతం చేసుకున్నా జనాలు థియేటర్స్ కి వచ్చి చూడమన్నా సినిమాను చూడలేదు… ఇక ఇప్పుడు మాత్రం సినిమా అద్బుతం అమోఘం అంటూ మెచ్చుకుంటున్నారు…
సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది, అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా అక్కడ సినిమాను చూసిన ఆడియన్స్ అందరూ కూడా మాస్ ఎలివేషన్ లు, హీరోయిజం ఎలివేట్ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉన్నాయి అంటూ మెచ్చుకుంటున్నారు..
కథ కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కేజిఎఫ్, పుష్ప లాంటి సినిమాలతో పోల్చితే మంచి ఎలివేషన్ లు సినిమాలో పడ్డాయని, సుదీర్ బాబుకి మంచి కంబ్యాక్ మూవీ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఎంత మెచ్చుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమాను జనాలు అనుకున్న రేంజ్ లో…
చూడకపోవడం వలన బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకున్న సినిమా అనుకున్న రేంజ్ లో థియేటర్స్ లోకి జనాలు వచ్చి ఉంటే సుదీర్ బాబుకి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ హిట్ గా నిలిచేది. కానీ జనాలు థియేటర్స్ లో చూడలేదు కానీ ఇప్పుడు ఓటిటిలో మాత్రం సినిమాను ఎగబడి చూస్తూ డిజిటల్ హిట్ గా సినిమాను నిలిపారు…