బాక్స్ ఆఫీస్ దగ్గర 4వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టింది పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ…ఇప్పటికీ డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమా అన్ని చోట్లా మంచి జోరుని చూపిస్తూ ఉండగా ఈ వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర…
తెలుగు రాష్ట్రాల్లో ధనుష్(Dhanush) నటించిన రాయన్(Raayan Movie) రిలీజ్ కాబోతూ ఉండగా…పోటిని తట్టుకుని ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక 29వ రోజులో ఉన్న కల్కి మూవీ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డే 28కి సిమిలర్ గా…
ట్రెండ్ అవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 26-30 లక్షల రేంజ్ లో షేర్ ని హిందీలో 75 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి…అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు.
ఇక శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ధనుష్ రాయన్ మూవీకి తమిళ్ లో సాలిడ్ గా ప్రీ బుకింగ్స్ జరుగుతూ ఉండగా తెలుగు లో మాత్రం యావరేజ్ బుకింగ్స్ ఉన్నాయి. దాంతో ఇక్కడ సినిమాకి టాక్ చాలా కీలకంగా మారింది అని చెప్పాలి. ఇక తమిళ్ లో మాత్రం మొదటి రోజున..
అవలీలగా 10 కోట్లకు పైగానే గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు టాక్ డీసెంట్ గా ఉంటే 1 కోటి కి పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు. ఇక టాక్ బాగుంటే షో కి కలెక్షన్స్ పరంగా సినిమా జోరు చూపించవచ్చు…
మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ధనుష్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. టాక్ పాజిటివ్ గా ఉంటే కనుక టోటల్ అంచనాలను సినిమా మొదటి రోజు మించిపోవచ్చు.