బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టిన ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) ఈ వారంలో కొత్త సినిమాల నుండి పోటి ఎదురుకున్నా కూడా ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో ఒక హాలీవుడ్ బిగ్గీ అండ్ తమిళ్ క్రేజీ డబ్ మూవీ లు పోటిలో రిలీజ్ వలన థియేటర్స్ తగ్గినా కూడా 29వ రోజుతో పోల్చితే 30వ రోజు మరోసారి మంచి జోరునే చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం…
మొత్తం మీద మరోసారి మంచి జోరుని చూపిస్తున్న సినిమా 30వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 25-28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక హిందీలో సినిమా 70 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ లెక్కలు ఇంకా పెరగవచ్చు. ఇక సినిమా మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా తిరిగి నైట్ షోలకు…
డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ తక్కువగా ఉంటే 30వ రోజున 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…
మరోసారి 1 కోటి మార్క్ ని దాటే ఛాన్స్ ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా కొత్త సినిమాలు రిలీజ్ అయినా హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటంతో ఈ వీకెండ్ లో తిరిగి గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా 30 రోజుల కలెక్షన్ ఎలా ఉంటాయో చూడాలి.