బాక్స్ ఆఫీస్ దగ్గర 2006 టైంలో అంచనాలను మించి మాస్ రచ్చ చేసిన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు(Vikramarkudu Movie) రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది….ఆ టైంలో మాస్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించిన ఈ సినిమా…
రిలీజ్ అయిన 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రీ రిలీజ్ చేశారు…ఆ టైంలో 12 కోట్ల బిజినెస్ మీద 19 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విక్రమార్కుడు మూవీ ఇప్పుడు జులై 27న లిమిటెడ్ థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాల్లో…
రీ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి మాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఓపెన్ అయ్యింది. ఆంధ్ర సీడెడ్ లలో మంచి ఓపెనింగ్స్ ను అందుకున్న విక్రమార్కుడు4K మూవీ రీ రిలీజ్ కొన్ని చోట్ల 70-80% ఆక్యుపెన్సీతో ఓపెన్ అవ్వగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయ్యింది…
ఒక పక్క కొత్త సినిమాలు ఉన్నా కూడా మరో పక్క రవితేజ రీసెంట్ మూవీస్ రిజల్ట్ లు దెబ్బ కొట్టినా కూడా విక్రమార్కుడుని చూడటానికి జనాలు థియేటర్స్ కి భారీ లెవల్ లో వస్తూ ఉండటం విశేషం. దాంతో వైజాగ్ హైదరాబాదు మరికొన్ని చోట్ల సినిమా కి హౌస్ ఫుల్ బోర్డులతో…
ఓపెన్ అయిన విక్రమార్కుడు సినిమా రవితేజ మాస్ పవర్ ని ఇప్పటికీ చూపిస్తూ ఉండటం విశేషం… ఇక రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ త్వరలో రిలీజ్ కానుండగా ఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ కంబ్యాక్ ను ఎంతవరకు సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…