బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకున్న కోలివుడ్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie 2nd Day Collections) సినిమా 23 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా తమిళ్ లో రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆల్ మోస్ట్ మొదటి రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం కాగా తెలుగు లో మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద మరోసారి డీసెంట్ హోల్డ్ ని అయితే సొంతం చేసుకుని 70-80 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా తమిళ్ లో సినిమా మరోసారి 10 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో డీసెంట్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో కూడా రెండో రోజున మంచి ట్రెండ్ ని చూపిస్తూ ఉండగా…
ఓవరాల్ గా అన్ని చోట్లా కలిపి సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. 18-20 కోట్ల ఛాన్స్ లు కూడా ఉన్న సినిమా ఓవరాల్ గా రెండో రోజు కూడా వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా…
వీకెండ్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉన్న రాయన్ మూవీ వర్కింగ్ డేస్ లో ఇదే రేంజ్ లో హోల్డ్ ని కొనసాగిస్తే వాల్యూ బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక టోటల్ గా సినిమా 2 రోజులకు గాను సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.