Home న్యూస్ డే 30 మీద డబుల్…బాలీవుడ్ బిగ్గీస్ ను తుక్కుతుక్కుగా కొట్టిన కల్కి!

డే 30 మీద డబుల్…బాలీవుడ్ బిగ్గీస్ ను తుక్కుతుక్కుగా కొట్టిన కల్కి!

0
Kalki 2898 AD Movie Ticket Sales on 31st Day Record
Kalki 2898 AD Movie Ticket Sales on 31st Day Record

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD Movie) 5వ వారంలో అడుగు పెట్టి ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా…

సినిమా రిలీజ్ అయిన 31వ రోజు అంచనాలను మించే రేంజ్ లో జోరు చూపించి టికెట్ సేల్స్ పరంగా మాస్ రచ్చ చేసింది. సినిమా 30వ రోజు జరిగిన టికెట్ సేల్స్ మీద 31వ రోజు టికెట్ సేల్స్ ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ లో టికెట్ సేల్స్ తో దుమ్ము లేపింది…

మొత్తం మీద 30వ రోజున బుక్ మై షోలో ఆల్ మోస్ట్ 35 వేలకి పైగా టికెట్ సేల్స్ జరగగా… 31వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో మాస్ రచ్చ చేసిన కల్కి మూవీ ఏకంగా ఆల్ మోస్ట్ 64 వేల రేంజ్ లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…

Kalki 2898 AD 30 Days Total World Wide Collections!!

రిలీజ్ అయిన 30 రోజుల తర్వాత ఇలాంటి ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక బుక్ మై షోలో ఇలా టికెట్ సేల్స్ ను అప్ డేట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత జవాన్ మూవీ 31వ రోజున 56 వేల టికెట్ సేల్స్ ను సాధించగా యానిమల్ మూవీ 33 వేల టికెట్ సేల్స్ ను…

గదర్2 మూవీ 31 వేల లోపు టికెట్ సేల్స్ ను అందుకోగా బాలీవుడ్ బిగ్ బ్లాక్ బస్టర్స్ ను డామినేట్ చేసిన కల్కి మూవీకి హిందీ బెల్ట్ లో సాలిడ్ ట్రెండ్ 31వ రోజు కూడా కొనసాగగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హోల్డ్ హెల్ప్ కలిసి వచ్చి 31వ రోజున అనుకున్న రేంజ్ కి మించి టికెట్ సేల్స్ ను అందుకుని….

తుక్కు తుక్కుగా ఇతర బ్లాక్ బస్టర్ మూవీస్ టికెట్ సేల్స్ ను క్రాస్ చేసి మాస్ రచ్చ చేసింది. ఇక 32వ రోజు కూడా సండే అడ్వాంటేజ్ ఉండటంతో కల్కి మూవీ మరోసారి అన్ని చోట్లా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉండగా లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 29 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here