Home న్యూస్ 32వ రోజు హౌస్ ఫుల్స్ ఏంటి సామి…మెంటల్ మాస్ జాతర ఇది!

32వ రోజు హౌస్ ఫుల్స్ ఏంటి సామి…మెంటల్ మాస్ జాతర ఇది!

0
Kalki 2898 AD Movie 32nd Day Box Office Openings Report
Kalki 2898 AD Movie 32nd Day Box Office Openings Report

రీసెంట్ టైంలో పండగ టైంలో తప్పితే మిగిలిన టైంలో రిలీజ్ అయిన పెద్ద స్టార్స్ అండ్ క్రేజ్ ఉన్న ఇతర సినిమాలు మహా అయితే రెండు మూడు వారాల రన్ ని కొనసాగించేవి….కానీ ఆ తర్వాత రన్ ని అందుకున్న సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి…కానీ రీసెంట్ టైంలో ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లేకుండా నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన…

కల్కి(Kalki 2898 AD Movie)సినిమా రిలీజ్ అయిన 5వ వారంలో కూడా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న సినిమా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ 31వ రోజు అంచనాలను మించి జోరు చూపించిన తర్వాత 32వ రోజున సినిమా మరోసారి సండే అడ్వాంటేజ్ తో…

Kalki 2898 AD 31 Days Total World Wide Collections!!

రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల 70% రేంజ్ లో ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉండగా కొన్ని చోట్ల షోలు హౌస్ ఫుల్ కూడా అయ్యాయి…ఇక తెలుగు రాష్ట్రాల ఆవల కూడా సినిమా చెన్నై, డిల్లీ, ముంబై ఇక ఇతర చోట్ల కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. రిలీజ్ అయిన 32వ రోజున ఇలా హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకు పోతున్న కల్కి మూవీ…

రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను నార్మల్ టైంలో సొంతం చేసుకుని సంచనలం సృష్టించింది అని చెప్పాలి. సినిమా ఊపు చూస్తూ ఉంటే 32వ రోజున ఓవరాల్ గా ఇప్పుడు 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరుని చూపిస్తున్న సినిమా…

హిందీలో రెట్టించిన జోరు చూపిస్తూ మాస్ ఊచకోత కోస్తుంది… సినిమా 5వ వీక్ లో కూడా హోల్డ్ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే ఆగస్టు 15 మూవీస్ వచ్చే వరకు ఇదే జోరును కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా 32 వ రోజు ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక….

Kalki 2898 AD 29 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here