బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లాస్ట్ మూవీస్ ది వారియర్ మరియు స్కంద సినిమాలు ఆడియన్స్ అంచనాలను అందుకునే విషయంలో విఫలం అవ్వగా మరో పక్క డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన లైగర్ మూవీ ఎపిక్ డిసాస్టర్ తర్వాత కూడా పూరీని నమ్మి తనకి ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) లాంటి…
ఊరమాస్ ఇచ్చిన డైరెక్టర్ తో కలిసి చేస్తున్న సీక్వెల్ మూవీ అయిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ ఆడియన్స్ ముందుకు ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా పోటిలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఊరమాస్ క్రేజ్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది ఇప్పుడు…
ఆల్ మోస్ట్ 70కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా సౌత్ భాషల టోటల్ డిజిటల్ బిజినెస్ ఊరమాస్ రేటుకి పలికింది. ఏకంగా 33 కోట్ల రేంజ్ లో రేటుని సినిమా సొంతం చేసుకోగా..
ఇక హిందీ వర్షన్ శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులు ఆల్ మోస్ట్ 35 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకున్నట్లు అంచనా…ఇక మ్యూజిక్ రైట్స్ కింద సినిమాకి 8 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకున్నట్లు అంచనా..దాంతో ఓవరాల్ గా సినిమాకి నాన్ థియేట్రికల్..
రైట్స్ కింద ఏకంగా 76 కోట్ల మమ్మోత్ రేటుని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల అంచనా…దాంతో బడ్జెట్ మీద ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే ఏకంగా బడ్జెట్ మొత్తం రికవరీ అయ్యి టేబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగే…
బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతూ ఉండగా అదంతా కూడా బిగ్ బోనస్ అనే చెప్పాలి. ఓవరాల్ గా వరుస ఫ్లాఫ్స్ తో కూడా ఈ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని దూసుకు పోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఏమాత్రం జోరు చూపించినా అంచనాలను మించి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది…