బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్తవాళ్ళు నటించిన సినిమాలు సక్సెస్ అవ్వాలి అంటే కష్టమే…పెద్ద పెద్ద స్టార్స్ నటించిన సినిమాలే ఆడియన్స్ పట్టించుకోవడం లేదు…ఇక కొత్త యాక్టర్స్ నటించిన సినిమాలు చూడాలి అంటే అందులో ఎంతో మ్యాటర్ ఉంటే తప్ప టికెట్ తెంపే అవకాశం తక్కువే… బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఈ ఏడాది….
ముంజ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొత్తవాళ్లతో వచ్చిన మరో సినిమా కిల్(KIll Movie Review Telugu) కల్కి(Kalki 2898 AD Movie) ఊపులో అనుకున్న రేంజ్ లో రీచ్ ను సొంతం చేసుకోలేక పోయింది.. కానీ ఈ సినిమా చూసిన చాలా తక్కువ మంది ఆడియన్స్ చెప్పిన మాట “ఇది కదా సినిమా అంటే”…
కొత్త యాక్టర్ కి కాకుండా ఏ స్టార్ హీరోకి ఈ కథ పడినా కూడా బాక్స్ ఆఫీస్ ఓ రేంజ్ లో షేక్ అయ్యేది…అంతలా షేక్ చేసే కథ కూడా సినిమాలో లేదు….కానీ ఆ టేకింగ్…ఆ యాక్షన్ సీన్స్ చూస్తున్నంత సేపు ఇది హాలీవుడ్ సినిమా ఏమో అనిపించే రేంజ్ లో మెప్పిస్తుంది….
కథ పాయింట్ కి వస్తే…మిలటరీ ఆఫీసర్ అయిన హీరో తను భారీ పలుకుబడి ఉన్న ఓ బిజినెస్ మ్యాన్ కూతురుని ఇష్టపడతారు…ఇద్దరూ ప్రేమించుకున్నా హీరోయిన్ ఫాదర్ తనకి మరో సంభందం చూస్తాడు…ఆ విషయం తెలుసుకున్న హీరో తన కోసం వస్తాడు….అందరూ ఒక ట్రైన్ జర్నీ లో ఉండగా…ఆ ట్రైన్ లోకి…
బందిపోటులు ఎంటర్ అయ్యి అల్లకల్లోలం సృష్టిస్తారు…ఆ క్రమంలో హీరో ఏం చేశాడు అన్నది సినిమా కథ…. కేవలం 1 గంటా 45 నిమిషాల రేంజ్ లెంత్ తోనే వచ్చిన ఈ సినిమా ఒక్క నిమిషం కూడా ఎక్కడా బోర్ అనిపించదు…కథలో ఎక్కువ పార్ట్ యాక్షన్ డోస్ ఉన్నప్పటికీ…
ఆ యాక్షన్ పార్ట్ కోరియోగ్రఫీ చూపు తిప్పుకోనివ్వదు…అలాగే రేసీ స్క్రీన్ ప్లే తో కూడా ఆడియన్స్ కి ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు వైలెన్స్ ఎక్కువగా అనిపించినా అది అవసరం అనిపించేలా ఉంటాయి… హాలీవుడ్ జాన్ విక్ రేంజ్ బ్లడ్ బాత్ సృష్టించారు కొత్తవాళ్ళు….
మొత్తం మీద సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏం సినిమా రా బాబు ఇది అని అనుకోవడం ఖాయం..అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కిని తట్టుకుని 24 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది…ఈ కథని ఏ టాప్ స్టార్ లేదా… మీడియం రేంజ్ హీరో చేసినా కూడా బ్లాక్ బస్టర్ అయ్యేది…మీకు ఇలాంటి ఊరమాస్ యాక్షన్ మూవీస్ ఇష్టమయితే కచ్చితంగా ఈ సినిమాను చూడండి…