బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు నెల మొదలు అవ్వగా ముందుగా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శివం భజే(Shivam Bhaje Movie Review) వరల్డ్ వైడ్ గా డీసెంట్ లెవల్ లో రిలీజ్ అయింది. ట్రైలర్ పర్వాలేదు అనిపించగా లాస్ట్ షాట్ మహా శివున్ని చూపించి అంచనాలు పెంచారు…మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ….
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే లోన్ రికవరీ ఏజెంట్ అయిన హీరో లైఫ్ ను లీడ్ చేస్తూ ఉండగా మరో పక్క పాకిస్థాన్ చైనాతో కలిసి ఇండియా మీద భారీ ధాడికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. మరో పక్క ఒక కెమికల్ ల్యాబ్ లో ఓ ఇద్దరు చనిపోతారు…ఆ చనిపోయిన వాళ్ళకి హీరో కి ఉన్న లింక్ ఏంటి…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
ఓవరాల్ గా కథ పాయింట్ బాగానే ఉంది…కానీ చెప్పిన విధానం ఏమంత ఇంపాక్ట్ ఫుల్ గా లేదు…ముఖ్యంగా ఫస్టాఫ్ లో కథ ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా సాదాసీదాగా సాగుతూ లవ్ అండ్ కామెడీ సీన్స్ వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు…కానీ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ మెప్పించి ఇంటర్వెల్ వరకు ఆకట్టుకోగా…
సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సెకెండ్ ఆఫ్ కథ కూడా కొంచం డ్రాగ్ అయినా కూడా ఫస్టాఫ్ తో పోల్చితే బెటర్ గానే అనిపించింది…ఇక మహా శివున్ని ఈ కథలో ఇన్వాల్వ్ చేసిన తీరు కొంచం ఇంప్రెస్ చేయగా మిగిలిన కథ మాత్రం చాలా వరకు డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది…
ఉన్నంతలో అశ్విన్ పర్వాలేదు అనిపించేలా నటించినా నటనలో మరింత మెరుగు అవ్వాల్సిన అవసరం ఉంది. హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా విలన్ అండ్ ఇతర యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు.. సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి..
డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా ఫస్టాఫ్ కంప్లీట్ గా డ్రాగ్ చేసి సెకెండ్ ఆఫ్ లో కొంచం బెటర్ గా డీల్ చేశాడు. ఫస్టాఫ్ ను ఇంకా బెటర్ గా చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఫస్టాఫ్ బిలో యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ యావరేజ్ లెవల్ లో అనిపించగా పార్టు పార్టులుగా కొన్ని సీన్స్ మెప్పించినా చూసే ఆడియన్స్ కి ఓపిక అవసరం…..
ఫస్టాఫ్ ను బెటర్ గా తీసి ఉంటే ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో ఉండేది సినిమా…మొత్తం మీద కొంచం ఓపికతో సినిమా చూస్తె ఓవరాల్ గా యావరేజ్ అనిపించేలా ముగుస్తుంది..ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్….