Home న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తున్న మురారి4K…సెన్సేషనల్ బుకింగ్స్ రాంపెజ్!

ప్రకంపనలు సృష్టిస్తున్న మురారి4K…సెన్సేషనల్ బుకింగ్స్ రాంపెజ్!

1
Mahesh Babu Murari4K Movie Pre Bookings Report
Mahesh Babu Murari4K Movie Pre Bookings Report

రీ రిలీజ్ ల ట్రెండ్ అయిపొయింది అనుకుంటే తిరిగి రీ రిలీజ్ ల ట్రెండ్ కు ఊపిరి పోస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు టైంలో రిలీజ్ కి ఎప్పుడో వచ్చిన ఓల్డ్ క్లాసిక్ మూవీ అయిన మురారి(Murari4K Re Release)ని రీ రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వగా సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో అన్న…

అనుమానాలు ఉన్నప్పటికీ అన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈ ఓల్డ్ క్లాసిక్ మూవీతో సెన్సేషనల్ రాంపెజ్ ను వారం ముందు నుండే రచ్చ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్….రీసెంట్ గా సినిమా రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా…

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న మురారి మూవీ మొదటి రోజు ప్రీ బుకింగ్స్ లెక్క బుక్ మై షో లో ఏకంగా 40 వేల టికెట్ సేల్స్ ను టచ్ చేసింది…ఇది రీ రిలీజ్ బుకింగ్స్ లో రికార్డ్ అనే చెప్పాలి. ఇది వరకు రిలీజ్ డే టైంలో బిజినెస్ మాన్ మూవీ 39 వేలకు పైగా టికెట్ సేల్స్…

జరగగా ఇప్పుడు రిలీజ్ కి వారం ముందే మురారి మూవీ కి ఈ రేంజ్ లో టికెట్ సేల్స్ సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి…. అల్టిమేట్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న మురారి మూవీ ఆగిపోయిన రీ రిలీజ్ ల ట్రెండ్ కి మళ్ళీ కొత్త ఊపిరి పోసింది అని చెప్పాలి…

సినిమా హైదరాబాదు లో అడ్వాన్స్ బుకింగ్స్ కింద ఆల్ రెడీ 50 లక్షలకు పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ప్రీ బుకింగ్స్ తో 75 లక్షల దాకా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. రిలీజ్ ఇంకా టైం చాలానే ఉండటంతో….

సినిమా ఇదే రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ ను చూపిస్తే తిరిగి రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఓవరాల్ ఆగిపోయిన రీ రిలీజ్ ల ట్రెండ్ కి మురారి మూవీ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here