5 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) మూవీ పెద్దగా పాజిటివ్ టాక్ ఏమి సొంతం చేసుకోలేదు. రొటీన్ కథనే హీరో క్యారెక్టరైజేషణ్ బాగుండటం, సంగీతం బాగా హైలెట్ అవ్వడంతో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది…
ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ ఈ నెల 15న రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ రకరకాలుగా అనిపించింది అని చెప్పాలి. ఫస్ట్ పాయింట్ సేం మొదటి పార్ట్ లో ఉన్నట్లే కథ రెండో పార్ట్ లో ఉండబోతుందని….
అదే ఒక వ్యక్తి మెమొరీని ఆల్ రెడీ సక్సెస్ ఫుల్ గా ట్రాన్ ఫెర్ చేసిన హీరోకే మరోసారి ట్రాన్స్ ఫెర్ చేయబోతూ ఉండగా, మరో పాయింట్ మొదటి పార్ట్ లో మాదిరిగానే ట్రైలర్ లో కథ లేదని తెలుస్తూ ఉండగా జస్ట్ హీరో క్యారెక్టరైజేషణ్ మీద సినిమా ఉండబోతుందని కన్ఫాం అయ్యింది…
కానీ ఈసారి బాలీవుడ్ టచ్ ఇస్తూ సంజయ్ దత్ ను తేవడం ఒక్కటే కొత్తదనం కాగా ఆ క్యారెక్టర్ గురించిన కథని కూడా ట్రైలర్ లోనే చెప్పేశారు. సంజయ్ దత్ ఎదో ఒక వ్యాధితో చనిపోబోతున్నాడని తన మెమొరీని ఇలా ట్రాన్స్ ఫెర్ చేసే ఆప్షన్ ఉందని తెలిసి హీరోకి ఇది ఆల్ రెడీ చేశారని తెలుసుకుని తన మెమొరీని హీరో బ్రెయిన్ కి…
ట్రాన్స్ ఫెర్ చేయాలని ప్రయత్నాలు చేయడం….ఇక తర్వాత ఏమవుతుందో అన్నది సినిమాలో చూడండి అంటూ చెప్పారు ట్రైలర్ లో…ఓవరాల్ గా ట్రైలర్ లోనే కథ పాయింట్ ని చెప్పేశారు..మొదటి పార్ట్ కథలానే అనిపించడం…అదే లౌడ్ సౌండ్స్ కొంచం విసుగు తెప్పించినా కూడా…
ఆలీ కామెడీ పార్ట్ ట్రైలర్ కే మైనస్ లా అనిపించినా కూడా ఓవరాల్ గా కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అంశాలు మరోసారి సినిమాలో ఉండటంతో పాటు మ్యూజిక్ కూడా మొదటి పార్ట్ లానే సక్సెస్ అవ్వడంతో ఈ సారి కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కమర్షియల్ గా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి.
కానీ ఒకప్పటి పూరీ జగన్నాథ్ రేంజ్ మూవీస్ తో పోల్చితే రీసెంట్ టైంలో పూరీ చేస్తున్న లౌడ్ యాక్షన్ మూవీస్ మాదిరిగానే డబుల్ ఇస్మార్ట్ కూడా ఉండబోతుండటంతో ఒకప్పటి పూరీ స్టైల్ ఆఫ్ డైరెక్టర్ ని ఆడియన్స్ మిస్ట్ అవుతున్నారు ఇప్పటికీ…డబుల్ ఇస్మార్ట్ మూవీతో ఆ పూరీ బయటికి వస్తాడా లేదా చూడాలి ఇప్పుడు.