బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న అల్లు శిరీష్(Allu Sirish) నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ(Buddy Movie 3 Days Collections) డీసెంట్ ప్రమోషన్స్ తర్వాత ఆడియన్స్ ముందుకు రాగా సినిమా ఆడియన్స్ ను అలరించడంలో విఫలం అయ్యింది. జనాలను థియేటర్స్ కి రప్పించడానికి టికెట్ రేట్స్ ను భారీగా తగ్గించినా కూడా…
ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రాలేదు…దానికి తోడూ టార్గెట్ చేసిన చిన్న పిల్లలు కూడా సినిమా మీద ఆసక్తిని పెద్దగా చూపించలేదు…సినిమా 2 రోజుల్లో మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 60 లక్షల షేర్ ని అందుకున్న సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా…
పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేక పోయిన సినిమా మరోసారి 20 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 25 లక్షల లోపు షేర్ ని అందుకోగా…కొన్ని చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ కూడా పడ్డాయి కానీ ఏమాత్రం ఇంపాక్ట్ అయితే బాక్స్ అఫీస్ దగ్గర కనిపించలేదు…
ఓవరాల్ గా వీకెండ్ పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో షేర్ ట్రేడ్ లెక్కల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు….ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
4.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా వీకెండ్ లో పట్టుమని 1 కోటి షేర్ ని కూడా రాబట్టలేకపోయింది. ఎప్పటి నుండో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ ఈ సినిమాతో కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేసినా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంది.