Home న్యూస్ హిట్టు కొట్టి 8 ఏళ్ళు…ఆఫర్ పెట్టినా వర్కౌట్ అవ్వలేదు…వర్కింగ్ డేస్ పరిస్థితి ఇదే!!

హిట్టు కొట్టి 8 ఏళ్ళు…ఆఫర్ పెట్టినా వర్కౌట్ అవ్వలేదు…వర్కింగ్ డేస్ పరిస్థితి ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న నటుల్లో ఒకరైన అల్లు శిరీష్(Allu Sirish) 2016 టైంలో శ్రీరస్తూ శుభమస్తూ సినిమా హిట్ కొట్టగా తర్వాత చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. రెండేళ్ళ క్రితం వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా ఎంతో కొంత ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకున్నా కూడా…

అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ అయిన బడ్డీ(Buddy Movie Box Office Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక చేతులు ఎత్తేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ న్, చిన్నపిల్లలను థియేటర్స్ కి రప్పించడానికి…

టికెట్ రేట్స్ ను భారీగా తగ్గించి 95-125 వరకు తక్కువ రేట్స్ ను సింగిల్ స్క్రీన్స్ మల్టిప్లెక్స్ లలో పెట్టినా కూడా జనాలను ఏమాత్రం థియేటర్స్ కి రప్పించలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కే చేతులు ఎత్తేసింది….

మొత్తం మీద ఇప్పటి వరకు సినిమా తెలుగు రాష్ట్రలలో 90 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ లెక్క 2.25 కోట్ల దాకా ఉంది. ఇందులో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ కూడా తీసేస్తే…

షేర్ ఏమంత ఉండదనే చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా ఈ సినిమాతో కంబ్యాక్ ను ఆశించిన అల్లు శిరీష్ కి బడ్డీ సినిమా తీవ్రంగా నిరాశ కలిగించే రిజల్ట్ ను ఇచ్చింది. వరల్డ్ వైడ్ వాల్యూ టార్గెట్ 4.5 కోట్ల దాకా ఉండగా సినిమా చాలా దూరంలోనే బాక్స్ ఆఫీస్ రన్ ను ఆపేయబోతుంది. ఇక అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమాతో అల్లు శిరీష్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here