Home న్యూస్ డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ టాక్ వచ్చేసింది….సెన్సార్ టాక్ ఇదే!!

డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ టాక్ వచ్చేసింది….సెన్సార్ టాక్ ఇదే!!

0
Double iSmart Movie Censor Review and Run Time Details
Double iSmart Movie Censor Review and Run Time Details

2019 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు ఈ ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో రాబోతున్న డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ….

రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా ఓవరాల్ గా ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది…సినిమా యాక్షన్ పార్ట్ కొంచం ఎక్కువగానే ఉందని అంటున్నారు….అందుకే ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకోగా ఇక ఓవరాల్ గా రన్ టైం పరంగా 2 గంటల 40 నిమిషాల రన్ టైంతో…

సినిమా రాబోతూ ఉండగా ఇక సెన్సార్ వాళ్ళ నుండి ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది ఇప్పుడు…కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయకపోయినా కూడా మరో ఆల్ రెడీ ఒకసారి ఒక పోలీస్ మెమొరీని హీరోకి ట్రాక్స్ ఫెర్ చేయగా ఈ సారి ఒక మోస్ట్ వాంటెడ్ విలన్ మెమొరీ ని హీరోకి ట్రాన్స్ ఫెర్ చేయాలనీ చూడగా….

హీరో ఏం చేశాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా స్టోరీ గా ఉండబోతుంది… మొత్తం మీద కంప్లీట్ పూరీ మార్క్ సినిమా అయినా హీరో క్యారెక్టరైజేషన్ ఇస్మార్ట్ శంకర్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఎక్స్ లెంట్ యాటిట్యూడ్ తో సాలిడ్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో నిండిపోతుందని…

ఈ సారి మదర్ సెంటిమెంట్ త్రెడ్ ను కూడా యాడ్ చేయడం, కొన్ని సీన్స్ సెంటిమెంట్ వైజ్ బాగా వర్కౌట్ అయ్యాయని, అలాగే ఆలీ కామెడీ కొన్ని సీన్స్ కి బాగా వచ్చాయని అంటున్నారు…వీటితో పాటు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయిందని…. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ పరంగా రొటీన్ గానే ఉన్నప్పటికీ కూడా…

ట్రీట్ మెంట్ మాత్రం మొదటి పార్ట్ కి మించే రేంజ్ లో తీశారని, అది ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాస్ ఫ్యాన్స్ కి బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే సెన్సార్ అయిన తర్వాత సినిమా కి అక్కడ నుండి…

ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో రిపోర్ట్ లు అయితే వినిపిస్తున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఇదే రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా మొదటి పార్ట్ కి మించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here