Home న్యూస్ హౌస్ ఫుల్ బోర్డులతో మురారి4K జాతర….ఇది ఎవ్వరూ ఊహించని భీభత్సం!!

హౌస్ ఫుల్ బోర్డులతో మురారి4K జాతర….ఇది ఎవ్వరూ ఊహించని భీభత్సం!!

0

ఆల్ మోస్ట్ ఇక రీ రిలీజ్ ల ట్రెండ్ కి ఎండ్ కార్డ్ పడింది అనుకున్నా కూడా తిరిగి రీ రిలీజ్ లకు ఊపిరి పోసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన మురారి(Murari4K) మూవీ రిమార్కబుల్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు…

హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయ్యి సంచలనం సృష్టించింది. రిలీజ్ రోజు టైంకి ప్రీ టికెట్ సేల్స్ లెక్కలు సంచలనం సృష్టించగా ఆల్ మోస్ట్ 1 లక్షా 50 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న మురారి మూవీ గ్రాస్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేసిన సినిమా…

వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2.75 కోట్లకు పైగా బుకింగ్స్ ను అందుకుంది. హైదరాబాదులో సెన్సేషనల్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా అమెరికాలో 40 వేలకు పైగా డాలర్స్ ను ఆల్ రెడీ అందుకోగా ఆస్ట్రేలియాలో 15 వేలకు పైగా డాలర్స్ ను అందుకుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అవ్వగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

ఓవరాల్ గా టాలీవుడ్ లో ఎండ్ అయిపొయింది అనుకున్న రీ రిలీజ్ లకు తిరిగి ఊపిరి పోసిన మురారి మూవీ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ తో రచ్చ చేస్తుందో చూడాలి. ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి బర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here