బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి(Kalki 2898 AD) సినిమా అన్ని చోట్లా కుమ్మేయగా 7వ వారంలో అడుగు పెట్టినా కూడా ఇప్పటికీ స్టడీగా షేర్స్ ను రాబడుతున్న సినిమా మరో వీకెండ్ లో ఎంటర్ అవ్వగా…
45వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉన్న సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు కోటి గ్రాస్ మార్క్ ని అవలీలగా దాటడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు… 44వ రోజుతో పోల్చితే 25% రేంజ్ లో గ్రోత్ ఆన్ లైన్…
టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 12-14 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక హిందీలో మరోసారి వీకెండ్ అడ్వాంటేజ్ తో జోరు చూపిస్తున్న…
సినిమా 50 లక్షలకు పైగానే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తూ ఉండటంతో మొత్తం మీద 45వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 42-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…
50 లక్షల మార్క్ ని కూడా టచ్ చేసే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను టచ్ చేసే అవకాశం ఉంది. రిలీజ్ అయిన 45 వ రోజున వరల్డ్ వైడ్ గా కోటికి పైగా గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. ఇక టోటల్ గా సినిమా 45 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.