Home న్యూస్ తాతా వచ్చాడే…మళ్ళీ దంచి కొట్టాడే….ఇండియన్2 OTT రెస్పాన్స్ ఊహాతీతం!!

తాతా వచ్చాడే…మళ్ళీ దంచి కొట్టాడే….ఇండియన్2 OTT రెస్పాన్స్ ఊహాతీతం!!

0

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేకపోయిన విషయం అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలు తమిళనాడులో సినిమా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా…

ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది. మెయిన్ కథని మూడో పార్ట్ లో పెట్టి రెండో పార్ట్ ను పై పైన ఎదో కిచిడీ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా శంకర్ కెరీర్ లోనే ఆల్ టైం డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన ఇండియన్2 మూవీ…

బాక్స్ ఆఫీస్ రన్ ను త్వరగానే కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ అయింది. భారీ రేటు పెట్టి కొన్న నెట్ ఫ్లిక్స్ లో సినిమా అన్ని భాషల డిజిటల్ రిలీజ్ తర్వాత రెస్పాన్స్ ఏమయినా బాగుందా అంటే సినిమాలో వచ్చే పాట అయిన తాతా వస్తాడే…అదరగొట్టిపోతాడే కి రివర్స్…

Indian2-Bharateeyudu2 13 Days Total World Wide Collections!

లో తాతా వచ్చాడే…ఆడియన్స్ తలలను దంచి కొట్టాడే అనిపించే రేంజ్ లో సోషల్ మీడియా మొత్తం సినిమా మీద ఓ రేంజ్ లో ట్రోల్స్ పడుతూనే ఉన్నాయి…అసలు ఇది శంకర్ తీసిన సినిమానేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కమల్ హాసన్ గెటప్ కానీ, కమల్ హాసన్ వర్మం కళ సీన్స్….

కెమరా యాంగిల్స్…డైలాగ్స్…ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో ఉన్న ట్రోల్ స్టఫ్ రీసెంట్ టైంలో ఏ స్టార్ హీరో-డైరెక్టర్ ల సినిమాలో కూడా లేవనే చెప్పాలి అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ సీన్స్ అన్నింటిలోకి క్లైమాక్స్ ఎపిసోడ్ లో….ఒక కర్రతో బాబీ సింహాను కమల్ హాసన్…

వర్మం కళతో దెబ్బ కొట్టే సీన్ రీసెంట్ టైంలో ఏ సినిమాలో కూడా చూడని రేంజ్ ట్రోల్ స్టఫ్ అంటూ అంటున్నారు. ఇలా సినిమా గురించి వరుసగా వస్తున్న ట్రోల్స్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఏ సినిమాకి సొంతం అవ్వలేదు అనే చెప్పాలి…ఇంత ట్రోల్స్ లో కూడా….

ఒక్క పాజిటివ్ ఏంటి అంటే…పార్ట్ 3 ట్రైలర్ ను ఎండ్ లో చూపించిన విధానం మాత్రం పర్వాలేదు అనిపించగా అసలు కథ అందులోనే ఉందని…రెండో పార్ట్ ను ఎదో తీయాలి అంటే తీయాలి అనిపించేలా తీశారు అని అనుకోవచ్చు…ఇక పార్ట్3 అయినా బాగుంటుందో  లేక పార్ట్2 లెవల్ లో ఉంటుందో చూడాలి ఇక…

Indian2-Bharateeyudu2 2 Weeks (14 Days) Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here