Home న్యూస్ 3వ రోజు చిన్న సినిమా భీభత్సం…టార్గెట్ ఔట్….కమిటీ కుర్రోళ్ళు 3 డేస్ కలెక్షన్స్!

3వ రోజు చిన్న సినిమా భీభత్సం…టార్గెట్ ఔట్….కమిటీ కుర్రోళ్ళు 3 డేస్ కలెక్షన్స్!

0
Committee Kurrollu 3 Days Collections
Committee Kurrollu 3 Days Collections

అప్పుడప్పుడు కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సర్ప్రైజ్ చేస్తూ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉంటాయి…లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 3 Days Collections)మూవీ అంచనాలను ఓ రేంజ్ లో మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర…

బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం, మూడు రోజుల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి సంచలనం సృష్టించింది. రెండో రోజు 30 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా 3వ రోజు మరింతగా రెచ్చిపోయి 34 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…

అంచనాలను మించి పోయిన సినిమా మూడో రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.20 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దాటగా వరల్డ్ వైడ్ గా 2.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రిమార్కబుల్ గా హోల్డ్ చేసింది…

మొత్తం మీద సినిమా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 2.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 3.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని అంచనాలను మించి పోయే రేంజ్ లో మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 5.90 కోట్ల రేంజ్ దాకా ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల దాకా ఉండగా వీకెండ్ లోనే సినిమా వాల్యూ టార్గెట్ ను దాటేసి లాభాలలోకి ఎంటర్ అవ్వగా ఇక వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here