Home న్యూస్ విక్రం తంగలాన్ తెలుగు బిజినెస్…..పోటిలో టార్గెట్ కొడుతుందా లేదా!!

విక్రం తంగలాన్ తెలుగు బిజినెస్…..పోటిలో టార్గెట్ కొడుతుందా లేదా!!

0
Chiyaan Vikram Thangalaan Movie WW Business and Break Even Target
Chiyaan Vikram Thangalaan Movie WW Business and Break Even Target

కెరీర్ లో ఎప్పటికప్పుడు ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ నే ఎక్కువగా చేస్తున్న కోలివుడ్ హీరో చియన్ విక్రం(Chiyaan Vikram) రీసెంట్ గా పోన్నియన్ సెల్వన్ సిరీస్ లో ముఖ్య భూమిక పోషించి మంచి క్రేజ్ ను తిరిగి సొంతం చేసుకోగా ఇప్పుడు మరోసారి తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఎక్స్ పెరిమెంట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్(Thangalaan Movie)…

భారీ ఎత్తున ఇండిపెండెంట్స్ డే వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ప్రమోషన్స్ సాలిడ్ గానే జరగగా ట్రైలర్ కూడా బాగానే క్లిక్ అయ్యింది….రా రగ్గుడ్ మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఇష్టపడే ఆడియన్స్ ను…

బాగానే అట్రాక్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ పోటి నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా బిజినెస్ పరంగా మంచి రేటునే సొంతం చేసుకుందని చెప్పాలి. ఓవరాల్ గా పోటిలో కూడా ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో…

6 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు తెలుగులో సినిమా పోటిలో క్లీన్ హిట్ అవ్వాలి అంటే 6.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది….ఇక మాస్ కమర్షియల్ మూవీస్ నడుమ ఈ ఎక్స్ పెరిమెంటల్ మూవీ ఎంతవరకు టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి.

ఇక సినిమా తమిళ్ తో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ రేంజ్ 65 కోట్ల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా….దాంతో సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మినిమమ్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 135 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు లో పోటి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తమిళ్ లో మాత్రం భారీ లెవల్ లో రిలీజ్ కానున్న తంగలాన్ మూవీ ఎంతవరకు అంచనాలను అందుకుని రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here