బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) సినిమాతో ఊరమాస్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత చేసిన సినిమాలు ఆ రేంజ్ ని అందుకోలేదు. కానీ సినిమా సినిమాకి మాస్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie Review) సినిమాతో…
ఆడియన్స్ ముందుకు గ్రాండ్ లెవల్ లో వచ్చేయగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఇక్కడ నుండి ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా టాక్ ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే లెవల్ లో వినిపిస్తుంది అని చెప్పాలి..
కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయలేదు కానీ మొదటి పార్ట్ లో పోలిస్ ఆఫీసర్ మెమొరీని హీరోకి ట్రాన్స్ ఫెర్ చేయగా ఈ సారి ఒక మోస్ట్ వాంటెడ్ విలన్ అయిన సంజయ్ దత్ మెమొరీని హీరోకి ట్రాన్స్ ఫెర్ చేయాలని చూస్తారు…దాని వెనక మిస్టరీ…తర్వాత జరిగిన కథ కోసం సినిమా చూడాల్సిందే అంటున్నారు…
సినిమా కథ పాయింట్ చాలా నార్మల్ గానే అనిపించినా కూడా హీరో రామ్ క్యారెక్టరైజేషన్ మాత్రం మరోసారి ఫస్ట్ ఫ్రేం నుండి చివరి ఫ్రేమ్ వరకు సింగిల్ లైన్ పంచులు మాస్ సీన్స్ తో నిండిపోతుందని, హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి అని అంటున్నారు…
పాటలు బాగా వర్కౌట్ అవ్వడం మరింత ప్లస్ అవ్వగా ఫస్టాఫ్ మొత్తం మీద టైం పాస్ లా అనిపించినా ప్రీ ఇంటర్వెల్ నుండి కథ జోరు అందుకోగా…సెకెండ్ ఆఫ్ కథ అక్కడక్కడా డ్రాగ్ అయినా మధ్యలో మదర్ సెంటిమెంట్ సీన్స్ కొంచం పర్వాలేదు అనిపించాయని, అలాగే ఆలీ కామెడీ…
కొన్ని సీన్స్ కి నవ్వించగా క్లైమాక్స్ ఓకే అనిపించేలా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ యావరేజ్ లెవల్ లో..సెకెండ్ ఆఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో ఉందని అంటున్నారు…. ఓవరాల్ గా సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో పర్వాలేదు అనిపించగా..
కథ పరంగా రొటీన్ గానే అనిపించినా కూడా మొదటి పార్ట్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అంటే ఎలాంటి అంశాలు ఆడియన్స్ కోరుకుంటారో అలాంటి అంశాలు ఇందులో కూడా ఉండటంతో మాస్ ఆడియన్స్ కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉందని అంటున్నారు…
ఓవరాల్ గా ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమాకి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లోనే ఉండటంతో రెగ్యులర్ షోలకు మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి బెటర్ టాక్ సొంతం అయ్యే అవకాశం ఉండటంతో అన్నీ అనుకున్నట్లు జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు…