Home న్యూస్ 6వ రోజు కూడా కమిటీ కుర్రోళ్ళు మాస్ రచ్చ….ఎక్స్ లెంట్ హోల్డ్ ఇది!

6వ రోజు కూడా కమిటీ కుర్రోళ్ళు మాస్ రచ్చ….ఎక్స్ లెంట్ హోల్డ్ ఇది!

0
Committee Kurrollu 6 Days WW Collections
Committee Kurrollu 6 Days WW Collections

చిన్న సినిమానే అయినా కూడా రిలీజ్ అయిన రోజు నుండి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న చిన్న సినిమా కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 6 Days Collections)మూవీ వీకెండ్ లోనే మాస్ రచ్చ చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యి అన్ని చోట్లా ఊరమాస్ హోల్డ్ ని చూపించగా…

సినిమా 5వ రోజు మొత్తం మీద 13 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా 6వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 13 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను మరోసారి సొంతం చేసుకుంది…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 5వ రోజు లెవల్ లో…

హోల్డ్ చేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 55 లక్షల రేంజ్ లో షేర్ ని 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని మరోసారి చూపించగా…. మొత్తం మీద ఇప్పుడు…

6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 4.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 9.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది.

మొత్తం మీద సినిమా 3 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టార్గెట్ మీద 2 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఇక ఆగస్టు 15 వీకెండ్ మూవీస్ వలన ఈ సినిమాకి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండగా ఎంతవరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here