బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తార్ రామ్ పోతినేని(Ram Pothineni) పూరీ జగన్నాథ్ ల క్రేజీ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మాస్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie 1st Day Collections)….మంచి హైప్ నడుమ రిలీజ్ అవ్వగా సినిమా హైప్ కి తగ్గ టాక్ ను సొంతం చేసుకోలేదు కానీ ఉన్నంతలో రామ్ క్యారెక్టరైజేషన్ కోసం జనాలు భారీగానే…
థియేటర్స్ కి ఎగబడి వెళ్లారు అని చెప్పాలి. ఆగస్టు 15 హాలిడే అడ్వాంటేజ్ తో రిలీజ్ అయినా కూడా సోలో రిలీజ్ అయ్యి ఉంటే టాలీవుడ్ మీడియం మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే ఛాన్స్ ఉండేది కానీ పోటిలో రిలీజ్ అవ్వడం…అలాగే టాక్ కూడా…
కొంచం మిక్సుడ్ గా ఉన్నా కూడా బుకింగ్స్ పరంగా ఇతర సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది డబుల్ ఇస్మార్ట్ మూవీ…కానీ టాక్ పాజిటివ్ గా వచ్చి ఉంటే కలెక్షన్స్ లో మరింత జోరు చూపించే అవకాశం ఉండేది కానీ…
మొత్తం మీద ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా 5 కోట్ల రేంజ్ లెవల్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే కనుక ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఈజీగా డబుల్ డిజిట్ షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉన్నప్పటికీ టాక్ ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా ఇప్పుడు బాక్స్ అఫీస్ దగ్గర…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 5.5-6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి… మొత్తం మీద భారీ పోటిలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తే మాస్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అంతకన్నా ఎక్కువ వస్తే ఊచకోత అని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.