Home న్యూస్ ఆయ్ మూవీ 1st డే కలెక్షన్స్…చిన్న సినిమా కుమ్మేసిందిగా!

ఆయ్ మూవీ 1st డే కలెక్షన్స్…చిన్న సినిమా కుమ్మేసిందిగా!

0
Aay Movie 1st Day Total WW Collections
Aay Movie 1st Day Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో టాలీవుడ్ లో భారీ లెక్కన సినిమాలు రిలీజ్ అయ్యాయి….అన్ని సినిమాల మధ్య పోటిలో చాలా చిన్న సినిమా అయిన ఆయ్(Aay Movie 1st Day Collections) అనే సినిమా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గదే లేదు అన్నట్లు అదే డేట్ కి రిలీజ్ ను ఫిక్స్ చేయగా ఆగస్టు 15 ఈవినింగ్ షోల నుండి రిలీజ్ అయిన ఈ సినిమా లిమిటెడ్ స్క్రీన్స్ మాత్రమే రిలీజ్ కి దక్కినా కూడా…..

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో మంచి ఆక్యుపెన్సీని సొంతం చేసుకున్న ఆయ్ మూవీ మొదటి రోజు ఆల్ మోస్ట్ 12.5 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని సాలిడ్ రచ్చ చేసింది….పోటిలో చాలా సినిమాల మధ్య ఇన్ని టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోవడం విశేషం…

ఆఫ్ లైన్ లో కూడా టికెట్ సేల్స్ బాగానే జరగగా మొత్తం మీద మొదటి రోజు గ్రాస్ లెక్క 1 కోటి రేంజ్ దాకా ఉండటం విశేషం అని చెప్పాలి. వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ బుకింగ్స్ ను అటూ ఇటూగా సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 65 లక్షల లోపు షేర్ ని దక్కించుకుందని చెప్పాలి…

చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో ఇలాంటి షేర్ ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి. మొత్తం మీద మేకర్స్ ఓన్ రిలీజ్ నే ఎక్కువ చోట్ల చేయగా వాల్యూ బిజినెస్ రేంజ్ లెక్క 3.2 కోట్ల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉందని అంచనా…దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ వైజ్ క్లీన్ హిట్ అని చెప్పడానికి 3.5 కోట్లకు పైగా షేర్ ని కనుక సొంతం చేసుకుంటే…

బాక్స్ ఆఫీస్ లెక్కల్లో సినిమా క్లీన్ హిట్ అనిపించుకుంటుంది అని చెప్పొచ్చు….మొత్తం మీద మిగిలిన సినిమాల మీద బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఆయ్ మూవీ లాంగ్ వీకెండ్ లో మంచి జోరుని చూపించి రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది…లాంగ్ వీకెండ్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here