Home న్యూస్ ఉస్తాద్ రామ్ రీసెంట్ మూవీస్ డే 1 వసూళ్లు….మిక్సుడ్ టాక్ తో దంచికొడుతున్నాడు…కానీ!!

ఉస్తాద్ రామ్ రీసెంట్ మూవీస్ డే 1 వసూళ్లు….మిక్సుడ్ టాక్ తో దంచికొడుతున్నాడు…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో మాస్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసినా కూడా ఈ సినిమా క్రేజ్ దృశ్యా అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే మీడియం రేంజ్ మూవీస్ లో భారీ ఓపెనింగ్స్ ను అందుకుని ఉండేది కానీ పోటిలో మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోలేదు.

ఓవరాల్ గా మొదటి రోజు 6.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా, రామ్ కెరీర్ లో రీసెంట్ టైంలో కొంచం తక్కువ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది…కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను రీసెంట్ టైం లో సొంతం చేసుకున్న రామ్ ఈ సినిమాతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంటాడు అనుకున్నా అలా జరగలేదు…

ఒకసారి రీసెంట్ టైంలో రామ్ నటించిన మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…. 
#RamPothineni Recent movies AP TG Shares
👉#DoubleiSmart – 6.10CR*******
👉#SKANDA – 8.62CR
👉#TheWarriorr – 7.02CR
👉#REDTheFilm – 5.47Cr
👉#iSmartShankar- 7.73Cr
👉#HelloGuruPremaKosame – 3.75Cr
👉#VunnadhiOkateZindagi – 3.65Cr

మొత్తం మీద రీసెంట్ టైంలో సినిమా సినిమాకి మంచి జోరుని చూపిస్తున్న రామ్ అన్నీ సినిమాలు మిక్సుడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా ఓపెనింగ్స్ కుమ్మేస్తున్నాడు కానీ సరైన సినిమాలు ఎంచుకునే విషయంలో తప్పులు చేస్తున్న రామ్ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుని…

సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంటున్నా కూడా లాంగ్ రన్ లో అనుకున్న రేంజ్ ని అందుకోవడం లేదు….. ఇస్మార్ట్ శంకర్ కూడా టాక్ కొంచం ఓకే అనిపించినా కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకోగా రీసెంట్ టైంలో స్కంద బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఫ్యూచర్ లో చేసే సినిమాలతో సాలిడ్ జోరు చూపిస్తాడో లేదో చూడాలి ఇక….

Double iSmart Movie 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here