బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie 3rd Day Collections)రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా రెండో రోజు వర్కింగ్ డే లో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది.
ఇక మూడో రోజు నుండి వీకెండ్ అడ్వాంటేజ్ తో సాలిడ్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్న సినిమా మొత్తం మీద మూడో రోజు మరింతగా డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా డే 2 రేంజ్ లో షేర్ ని అందుకోవడానికి కొంచం ఛాన్స్ ఉండగా….
ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే మూడో రోజు సినిమా కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా సినిమా హోల్డ్ చేసిన తీరు తీవ్రంగా నిరాశ పరిచే విధంగానే ఉందని చెప్పాలి ఇప్పుడు..ఎక్స్ లెంట్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఉండగా…
మూడో రోజు కూడా డబుల్ ఇస్మార్ట్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను టోటల్ గా అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా…
సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఆల్ మోస్ట్ డిసైడ్ అయిపొయింది అని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏదైనా అద్బుతం జరిగి భారీ గ్రోత్ ని చూపించక పొతే మట్టుకు ఇక సినిమా ఎపిక్ లాసులను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.