Home న్యూస్ డబుల్ ఇస్మార్ట్-మిస్టర్ బచ్చన్ ని ఓడించిన చిన్న సినిమా….భీభత్సం ఇది!

డబుల్ ఇస్మార్ట్-మిస్టర్ బచ్చన్ ని ఓడించిన చిన్న సినిమా….భీభత్సం ఇది!

0

ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రెండు పెద్ద బడ్జెట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి… మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) అలాగే ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie)లు గ్రాండ్ గా రిలీజ్ అవ్వడంతో పోటిలో…

పెద్దగా అంచనాలు లేని చిన్న సినిమా ఆయ్ మూవీ(AAY Movie) రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోకుండా అదే డేట్ కి ఫిక్స్ అవ్వడంతో అందరూ పెద్ద సినిమాల నడుమ ఈ చిన్న సినిమాలు చుక్కలు కనిపించడం ఖాయమని అందరూ అనుకున్నారు….కానీ ఇప్పుడు…

రిలీజ్ అయిన మూడో రోజు జరిగిన టికెట్ సేల్స్ చూస్తె ఎవ్వరైనా ఆశ్యర్యపోవాల్సిందే…ఎందుకంటే ఊహించని రేంజ్ లో మూడో రోజు టికెట్ సేల్స్ పరంగా ఓ చిన్న సినిమా టికెట్ సేల్స్ రెండు బిగ్ బడ్జెట్ మూవీస్ కన్నా ఎక్కువగా ఉండటం అందరికీ షాకిచ్చింది అని చెప్పాలి ఇప్పుడు…

3వ రోజున రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీకి 11.5 వేల లోపు టికెట్ సేల్స్ మాత్రమే సొంతం అయ్యాయి. ఇక రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ కి మూడో రోజు 20 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ జరిగాయి…ఈ రెండు సినిమాల బిజినెస్ కి ఈ టికెట్ సేల్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి.

ఇక మూడో రోజులో ఉన్న ఆయ్ మూవీకి ఆల్ మోస్ట్ 28 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి…ఊహకందని రేంజ్ లో ఓ చిన్న సినిమా టికెట్ సేల్స్ పరంగా పెద్ద సినిమాలను డామినేట్ చేసి మాస్ రచ్చ చేయడం విశేషం…

లాంగ్ వీకెండ్ లో ఊచకోత కొస్తాయి అనుకున్న పెద్ద సినిమాలు అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అవ్వడం, అదే టైంలో అంచనాలు ఏమాత్రం లేని చిన్న సినిమా ఈ రేంజ్ లో రచ్చ చేయడం నిజంగానే భీభత్సం అని చెప్పాలి. ఇక లాంగ్ వీకెండ్ లో ఈ సినిమాలు ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here