ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) పూరీ జగన్నాథ్ ల కాంబోలో భారీ హైప్ నడుమ వచ్చిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) హైప్ కి తగ్గ టాక్ ను సొంతం చేసుకుని ఉంటే ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది కానీ సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో పర్వాలేదు అనిపించగా రెండో రోజు నుండి మాత్రం డ్రాప్స్ ను…
హెవీగా సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు నుండి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును మరింత కష్టతరం చేసుకుంది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశం చాలా తక్కువగానే ఉందని చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద రెండో రోజుతో పోల్చితే మూడో రోజు 25 లక్షల రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని 89 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని 1.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా ఇప్పుడు 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Double iSmart Movie 3 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 3.39Cr~
👉Ceeded: 1.22Cr
👉UA: 99L
👉East: 60L
👉West: 32L
👉Guntur: 85L
👉Krishna: 49L
👉Nellore: 27L
AP-TG Total:- 8.13CR(11.95CR~ Gross)
👉Ka+ROI: 81L
👉OS: 68L
Total WW Collections:- 9.62CR(15.10CR~ Gross)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 49 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 39.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఆదివారం, సోమవారంలో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేక ఇంతకుమించిన డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.