టాలీవుడ్ మార్కెట్ రేంజ్ పెరగడం ఏమో కానీ అవసరం ఉన్నా లేకున్నా అన్ని సినిమాలకు అవసరానికి మించి బడ్జెట్ లు పెట్టడం అన్నది అన్ని ఇండస్ట్రీలలో కూడా పెరిగిపోయింది. నిర్మాతల డబ్బు…వాళ్ళ ఇష్టం కానీ….సినిమాల పరంగా ఇలా అవసరానికి మించి బడ్జెట్ లు పెట్టడం వలన చాలా సార్లు పరిమిత బడ్జెట్ లో సినిమాలు రూపొంచాల్సి వస్తే మట్టుకు ఎదురుదెబ్బలు తగలడం ఖాయంగా కనిపిస్తుంది…
రీసెంట్ టైంలో రిలీజ్ అయిన మీడియం రేంజ్ సినిమాలకు సైతం హీరోల మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టారు…ఆ సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతో కొంత రికవరీ చేసినా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ లు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి. ఆడియన్స్ ముందుకు ఆగస్టు 15 వీకెండ్ లోనే రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ మరియు డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలకు….
ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల్లో 150 కోట్లకు పైగా బడ్జెట్ లు రెండు సినిమాలకు కలిపి అయినట్లు అంచనా….నాన్ థియేట్రికల్ బిజినెస్ లు కూడా డీసెంట్ గా జరిగినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెట్టిన బడ్జెట్ కి ఏమాత్రం న్యాయం చేయలేక పోయాయి ఈ సినిమా…ఈ ఇయర్ లోనే సంక్రాంతి తర్వాత బెస్ట్ హాలిడేస్ వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలకు…
తీవ్రమైన మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా అతి కష్టం మీద డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు 10 కోట్ల షేర్ మార్క్ ని దాటగా టోటల్ రన్ లో మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ ని కూడా అందుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా రెండు సినిమాల ఫైనల్ రన్ రెవెన్యూ 25 కోట్ల లోపే ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా…
పెట్టిన బడ్జెట్ దృశ్యా చూసుకుంటే బడ్జెట్ కి షేర్ కి మధ్య తేడా ఎన్ని కోట్లలో ఉండబోతుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు…రీసెంట్ టైంలో ఇలా బడ్జెట్ లెక్కల్లో చాలా సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ లేని రిజల్ట్ లు సొంతం అవ్వగా ఈ రెండు సినిమాలకు అన్ని అడ్వాంటేజ్ లు ఉన్నా ఇప్పుడు బయర్స్ కి చుక్కలు చూపించే నష్టాలు సొంతం చేసుకోబోతున్నాయి…