Home న్యూస్ చరిత్ర సృష్టించిన స్త్రీ2 మూవీ….4 రోజుల్లో 200 కోట్ల ఎపిక్ రికార్డ్!!

చరిత్ర సృష్టించిన స్త్రీ2 మూవీ….4 రోజుల్లో 200 కోట్ల ఎపిక్ రికార్డ్!!

0
Stree2 Movie 4 Days Total Collections
Stree2 Movie 4 Days Total Collections

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రికార్డులతో దూసుకు పోతున్న శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మూవీ అన్ని చోట్లా ఊహకందని రేంజ్ లో జోరుని చూపించగా ఫస్ట్ డే నుండి రికార్డుల భీభత్సం సృష్టిస్తున్న స్త్రీ2 మూవీ 3 రోజుల్లో 145 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 4వ రోజు సినిమాకి…

సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఊహకందని రేంజ్ లో జోరు చూపించిన సినిమా 50 కోట్ల మార్క్ ని దాటడం ఖాయం అనుకోగా సినిమా ఆ అంచనాలను కూడా మించి పోయిన స్త్రీ2 మూవీ…

ఏకంగా 58 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మెంటల్ మాస్ జాతర సృష్టించింది. సినిమా 4 రోజుల గ్యాప్ లో టోటల్ గా 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి మాస్ భీభత్సం సృష్టించింది ఇప్పుడు. ఒకసారి సినిమా మొత్తం మీద…

4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
#Stree2 HUMONGOUS Collections
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
Total Collections – 204.00CR NET💥💥💥💥

మొత్తం మీద ఈ ఇయర్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో ఊచకోత కోస్తున్న స్త్రీ2 మూవీ మరో రికార్డ్ ను కూడా నమోదు చేసింది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…

ఇక సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు కూడా హాలిడేనే అవ్వడంతో మరోసారి అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. లాంగ్ రన్ లో సినిమా 450-500 కోట్ల కలెక్షన్స్ ని టార్గెట్ చేసిందని చెప్పాలి ఇప్పుడు. ఇక 5వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here