Home న్యూస్ ఇదేం హోల్డ్ రా బాబు….5వ రోజు భీభత్సం సృష్టించిన స్త్రీ2!!

ఇదేం హోల్డ్ రా బాబు….5వ రోజు భీభత్సం సృష్టించిన స్త్రీ2!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డులను నమోదు చేస్తూ దుమ్ము దుమారం లేపుతున్న శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మూవీ, 4 రోజుల వీకెండ్ లో వీర లెవల్ లో కుమ్మేసి 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా 5వ రోజు సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర…

రాఖీ పండగ అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి రెట్టించిన జోరు చూపించి అన్ని చోట్లా మాస్ రచ్చ చేసి రెట్టించిన జోరుతో కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా 30-32 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అనిపించినా కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో…

మరోసారి మాస్ హోల్డ్ ని చూపించిన సినిమా ఏకంగా 38.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఊహకందని రేంజ్ లో భీభత్సం సృష్టించి మెంటల్ మాస్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉండగా…. మొత్తం మీద ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో…

సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Stree2 HUMONGOUS Collections
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
Total Collections – 242.40CR NET💥💥💥💥

సెన్సేషనల్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన స్త్రీ2 మూవీ 6వ రోజు నుండి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డే లో 20-22 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తే కనుక ఇక లాంగ్ రన్ లో 450 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here