బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హరీష్ శంకర్(Harish Shankar) ల క్రేజీ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) ఒరిజినల్ వర్షన్ రైడ్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో…
రీమేక్ కథకి…పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి రూపొందించాడని, ట్రైలర్ క్లిక్ అవ్వడం సాంగ్స్ సాలిడ్ గా హిట్ అవ్వడంతో బయర్స్ అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ రేట్లే పెట్టి సినిమాను కొన్నారు… ఏమాత్రం టాక్ బాగున్నా కూడా మంచి కలెక్షన్స్ తో…
రవితేజకి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అన్న నమ్మకంతో ఉన్నప్పటికీ ప్రీమియర్స్ తోనే సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోకపోవడంతో తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా, టాక్ మిక్సుడ్ గా ఉండటంతో మ్యూజిక్ హెల్ప్ తో అయినా జనాలు థియేటర్స్ కి వస్తారు అనుకున్నా…
జనాలు ఏమాత్రం సినిమాను పట్టించుకోలేదు…దాంతో హాలిడేస్ లో కంప్లీట్ గా డౌన్ అయిపోయిన సినిమా ఇప్పుడు భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా సినిమాను కొన్న బయ్యర్లు ఇప్పుడు తమకి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తుంది.
నైజాంలో సినిమాకి అడ్వాన్స్ బేస్ మీద బిజినెస్ జరగగా కొంత అమౌంట్ టార్గెట్ ను అందుకోకపొతే వెనక్కి ఇస్తామని అగ్రిమెంట్ జరగగా సినిమా బిజినెస్ లో పావు వంతు రికవరీని కూడా సరిగ్గా సొంతం చేసుకోలేదు…దాంతో అన్ని చోట్లా హెవీ లాసులు సొంతం చేసుకోబోతున్న మిస్టర్ బచ్చన్..
రిజల్ట్ చూసిన తర్వాత నిర్మాత కొంత మొత్తాన్ని వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారని టాక్ చక్కర్లు కొడుతూ ఉండగా మరో పక్క హీరో అలాగే డైరెక్టర్ కూడా తమ రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని వెనక్కి ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని టాక్ ఉండగా దానిపై త్వరలో ఫుల్ క్లారిటీ వస్తుందని అంటున్నారు…ఊహించిన దానికి మించి డిసాస్టర్ అయిన మిస్టర్ బచ్చన్ అందరినీ తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.