Home న్యూస్ ఇంద్ర4K కి హౌస్ ఫుల్స్….మెగాస్టార్ మెగా మాస్ జాతర!!

ఇంద్ర4K కి హౌస్ ఫుల్స్….మెగాస్టార్ మెగా మాస్ జాతర!!

0

టాలీవుడ్ ల స్లో అయిన రీ రిలీజ్ ట్రెండ్ తిరిగి రీసెంట్ గా మళ్ళీ ఊపు అందుకోగా ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఇంద్ర4K(Indra4K Re Release) సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రీ రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ ను సొంతం చేసుకోగా….

తెలుగు రాష్ట్రాల్లో అలాగే టోటల్ గా ఇండియాలో సినిమా ఆల్ మోస్ట్ 385 థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది…అన్ని చోట్లా బుకింగ్స్ మాస్ రాంపెజ్ ను చూపించగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా బిగ్గెస్ట్ ప్రీ బుకింగ్స్ తో మాస్ రాంపెజ్ ను చూపించగా….

నైజాంలో ఆల్ మోస్ట్ 80 లక్షల రేంజ్ లో బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా….తెలుగు రాష్ట్రాల్లో 1.30 కోట్ల దాకా బుకింగ్స్ ను అందుకోగా…ఇండియాలో 1.5 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను అందుకున్న సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ తో కలిపి 1.85 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ తో…

ఊహకందని రేంజ్ లో ఊచకోత కోయగా గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి…. ఎప్పటి నుండో థియేటర్స్ లో చూడాలి అనుకున్న మూవీస్ లో ఒకటైన ఇంద్ర మూవీ ఎట్టకేలకు ఇప్పుడు చిరు బర్త్ డే కానుకగా…

రీ రిలీజ్ అవ్వడంతో జనాలు భారీ సంఖ్యలో థియేటర్స్ కి వస్తూ ఉండటంతో ఓపెనింగ్స్ పరంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా భారీ రికార్డులను నమోదు చేయడం…

ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇక టాలీవుడ్ టాప్ రీ రిలీజ్ ఓపెనింగ్స్ లో కూడా ఒకటిగా కూడా ఇంద్ర మూవీ రీ రిలీజ్ నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here