Home న్యూస్ అక్షరాలా 400 కోట్లు…1st వీక్ లో అల్లకల్లోలం చేసిన స్త్రీ2!!

అక్షరాలా 400 కోట్లు…1st వీక్ లో అల్లకల్లోలం చేసిన స్త్రీ2!!

0

బాలీవుడ్ లో ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డులను నమోదు చేసిన శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మూవీ మొదటి రోజు నుండే రికార్డుల జాతర సృష్టించగా వీకెండ్ లో ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన తర్వాత కూడా వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన స్త్రీ2 మూవీ ఏమాత్రం జోరు తగ్గకుండా…

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సూపర్బ్ హోల్డ్ తో ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది…వర్కింగ్ డేస్ లో కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా కుమ్మేసిన స్త్రీ2 సినిమా 6వ రోజు 26.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

7వ రోజు మరో వర్కింగ్ డే లో కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా అనుకున్నట్లే కుమ్మేసి 20.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో మొదటి వారంలో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

#Stree2 HUMONGOUS Collections
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
Total Collections – 289.60CR NET💥💥💥💥

మొత్తం మీద రిమార్కబుల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న స్త్రీ2 మూవీ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో 400 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో అల్లకల్లోలం సృష్టించింది. ఇక రెండో వీక్ లో కూడా సినిమా మాస్ రాంపెజ్ సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here