Home న్యూస్ కల్కిని దాటేసిన స్త్రీ2….ఊహకందని రికార్డు సామి ఇది!!

కల్కిని దాటేసిన స్త్రీ2….ఊహకందని రికార్డు సామి ఇది!!

1

ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమాలు చాలా తక్కువగానే ఉండగా, ఆల్ మోస్ట్ ఎలాంటి హాలిడే లు లేకుండా నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని అందుకోగా…

అంచనాలను మించి అన్ని చోట్లా కుమ్మేసిన ఈ సినిమా హిందీలో కూడా ఊరమాస్ జోరుని చూపించింది, ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లేకుండానే సంచలనం సృష్టించిన హిందీ టోటల్ రన్ కలెక్షన్స్ ని ఇప్పుడు అంచనాలు బాగున్నా ఈ రేంజ్ లో రచ్చ చేస్తుంది అని ఎక్స్ పెర్ట్ చేయని….

 శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మూవీ ఊహకందని కలెక్షన్స్ తో మొదటి వారంలోనే బాలీవుడ్ మూవీస్ అన్నింటి రికార్డులు ఈ ఇయర్ కి గాను బ్రేక్ చేయగా ఇప్పుడు ఈ ఇయర్ ఓవరాల్ గా బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న ప్రభాస్ కల్కి మూవీ…

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

టోటల్ రన్ కలెక్షన్స్ ని 8 రోజుల్లో బ్రేక్ చేసిన స్త్రీ2 మూవీ సంచలన కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది. కల్కి మూవీ టోటల్ రన్ లో 293 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోగా కొన్ని ఏరియాల రిపోర్ట్ లు ఇంకా రావాల్సి ఉండగా 7 రోజుల్లోనే స్త్రీ2 మూవీ ఏకంగా…

289 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఊచకోత కోయగా ఇప్పుడు 8వ రోజు సాధించిన కలెక్షన్స్ తో కల్కి మూవీ టోటల్ హిందీ కలెక్షన్స్ ని క్రాస్ చేసి ప్రతిష్టాత్మక 300 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది…

ఈ సినిమాకి హాలిడేల అడ్వాంటేజ్ లు భారీగానే కలిసి రావడంతో అంచనాలను మించి జోరు చూపించినా కూడా కల్కి మూవీ ఎలాంటి హాలిడేలు లేకుండానే ఊచకోత కోయగా బడ్జెట్ పరంగా కల్కితో పోల్చితే చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన స్త్రీ2 మూవీ అంచనాలను మించి దుమ్ము లేపి ఇప్పుడు 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here