బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకున్న తర్వాత ఓపెనింగ్స్ పరంగా కూడా జోరు చూపించిన చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన తంగలాన్(Thangalaan Movie) మంచి స్టార్ట్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది. ఫస్ట్ వీక్ లో జస్ట్ ఓకే అనిపించిన సినిమా….
రెండో వారంలో మాత్రం తెలుగులో స్క్రీన్ కౌంట్ ని భారీగా పెంచుకుంది. మొదటి వారం మొత్తం మీద 250 స్క్రీన్స్ ను హోల్డ్ చేసిన ఈ సినిమా రెండో వీక్ కి వచ్చే సరికి 141 స్క్రీన్స్ ని పెరి ఇప్పుడు రెండో వీక్ లో 391 స్క్రీన్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం కాగా…
ఇక సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కొంచం గ్రోత్ ని చూపించిన సినిమా 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…బ్రేక్ ఈవెన్ కోసం మాత్రం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 8 రోజుల్లో సాధించిన తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 8 Days Telugu States Collections
👉Nizam: 1.79Cr~
👉Ceeded: 53L
👉Andhra: 1.58Cr
AP-TG Total:- 3.90CR(7.40CR~ Gross)
6.50 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 2.60 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 8వ రోజున 1.55 కోట్ల గ్రాస్ ను 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 8 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 31.00Cr
👉Telugu States- 7.40Cr
👉Karnataka- 3.75Cr
👉Kerala – 2.75Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 15.25CR****
Total WW collection – 60.90CR(28.80CR~ Share)
మొత్తం మీద సినిమా 66 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 37.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా స్క్రీన్స్ ను రెండో వారంలో పెంచుకున్న సినిమా ఈ వీక్ లో సాలిడ్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.